Shreyas Iyer : అయ్యర్ ఈజ్ బ్యాక్..క్లాస్ ప్లస్ మాస్ ఆటతో పంజాబ్ పై విరుచుకుపడ్డ ముంబై కెప్టెన్
Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో పంజా విసిరాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన అయ్యర్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లకు సమాధానం ఇచ్చాడు.

Shreyas Iyer : టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో పంజా విసిరాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన అయ్యర్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లకు సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా తలకు బంతి తగిలిన మరుసటి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ బాది, తనలో పౌరుషం తగ్గలేదని నిరూపించుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ప్లీన్ లాసరేషన్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు సారథిగా బరిలోకి దిగాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయినప్పటికీ, అయ్యర్ ఆడిన 34 బంతుల్లో 45 పరుగుల ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. పాత అయ్యర్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడని అతని బ్యాటింగ్ చూస్తుంటే అర్థమైంది.
ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. శ్రేయస్ అయ్యర్‌కు షార్ట్ పిచ్ బంతులు అంటే బలహీనత అని ఒక పేరుంది. దీనిని ఆసరాగా చేసుకుని పంజాబ్ బౌలర్ ఒక వేగవంతమైన బౌన్సర్ వేశాడు. ఆ బంతి నేరుగా వెళ్లి అయ్యర్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. వెంటనే మెడికల్ స్టాఫ్ మైదానంలోకి వచ్చి కన్కషన్ చెకప్ చేశారు. అయ్యర్ కాసేపు ఇబ్బంది పడ్డాడు. కానీ, తర్వాతి బంతికే బౌలర్ మళ్ళీ బౌన్సర్ వేయగా.. అయ్యర్ ఏమాత్రం తడబడకుండా కళ్లు చెదిరే పుల్ షాట్‌తో బంతిని స్టాండ్స్ లోకి పంపాడు.
తర్వాతి బంతికే సిక్సర్ కొట్టిన విధానం చూస్తుంటే, తనపై ఉన్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పినట్లు అనిపించింది. షార్ట్ పిచ్ బౌలింగ్ అంటే తనకు భయం లేదని, తనను రెచ్చగొడితే ఫలితం ఇలాగే ఉంటుందని అయ్యర్ నిరూపించాడు. ఈ అద్భుతమైన షాట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయ్యర్ లోని ఈ కాన్ఫిడెన్స్ చూసి ముంబై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ముంబై జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయినా, శ్రేయస్ అయ్యర్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కూడా శుభసూచకం. త్వరలో జరగబోయే ముఖ్యమైన సిరీస్‌ల కోసం అయ్యర్ సిద్ధంగా ఉన్నాడని ఈ ఇన్నింగ్స్ చాటి చెప్పింది. ముఖ్యంగా బౌన్సర్లకు అయ్యర్ భయపడటం లేదనే విషయం ప్రత్యర్థి జట్లకు ఒక హెచ్చరిక లాంటిదే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
