Unstoppable With NBK : అన్‌స్టాపబుల్‌లో షోలో డాకు మహారాజ్ టీమ్.. బాలయ్యతో కలిసి డైరెక్టర్ బాబీ సందడి..
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టింగ్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుతం నాలుగో సీజన్ రన్ అవుతుంది. తాజాగా ఈ షోలో డాకు మహారాజ్ టీమ్ సందడి చేసింది.
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న అడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా డాకు మహారాజ్ చిత్రయూనిట్ అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇందులో ఏడు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో సంక్రాంతి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో భాగంగా విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఎనిమిదో ఎపిసోడ్ కు ఎవరెవరు రానున్నారా అని ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ షోలో డాకు మహరాజ్ టీం సందడి చేయనుంది. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ లు ఈ షోలో పాల్గొననున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Blockbuster Director @dirbobby dashing entry at #UnstoppableWithNBK 🔥🔥🔥#DaakuMaharaaj @ahavideoIN pic.twitter.com/JvZnKRFLQ6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 29, 2024
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.