01 January 2025

ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మ. 

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న బ్యూటీ. ఆమె ఎవరో తెలుసా..?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్. 

ఒకప్పుడు హిందీ సినీ పరిశ్రమలో ప్రతి సినిమాకు రూ.14 నుంచి రూ.20 కోట్లు వరకు పారితోషికం తీసుకుంది ఈ అమ్మడు. 

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకొణే. ఒక్క సినిమాకు రూ.30 కోట్లు. 

బర్ఫీ, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రియాంక..పెళ్లి తర్వాత లాస్ ఎంజెల్స్ లో సెటిల్ అయ్యింది.

2017లో బేవాచ్ చిత్రం హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుని క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సిటాడెల్ సిరీస్ కోసం ప్రియాంక రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట.