Ram Gopal Varma: ‘ఇక చచ్చినా అలాంటివి చేయను’.. కొత్త ఏడాదికి ఆర్జీవీ షాకింగ్ రిజల్యూషన్స్.. లిస్ట్ చూశారా?

ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. ఎంతో ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

Ram Gopal Varma: 'ఇక చచ్చినా అలాంటివి చేయను'.. కొత్త ఏడాదికి ఆర్జీవీ షాకింగ్ రిజల్యూషన్స్.. లిస్ట్ చూశారా?
Director Ram Gopal Varma
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 4:57 PM

కొత్త సంవత్సరానికి అందరూ సాదర స్వాగతం పలికారు. విందులు, వినోదాల్లో మునిగి తేలారు. అలాగే తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఇక ఎప్పటిలాగే చాలా మంది తమ జీవితానికి సంబంధించి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఈ కోవలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరాడు. కొత్త సంవత్సరం కానుకగా షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారాయన. ఈ మేరకు 2025లో తన రిజల్యూషన్స్ గురించి చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడీ సెన్సేషనల్ డైరెక్టర్.

ఈ సంవత్సరం నేను 7 తీర్మానాలు తీసుకున్నాను అని మొదలు పెట్టిన వర్మ ఇలా రాసుకొచ్చాడు..

ఇవి కూడా చదవండి
  1.   నేను ఇక నుంచి వివాదరహితుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను
  2. నేను కూడా ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండాలని భావిస్తున్నాను
  3.  దేవుడి పట్ల భయం, భక్తి కలిగి ఉంటాను
  4.   ఇక నుండి ఏటా 10 సత్య లాంటి సినిమాలు తెరకెక్కిస్తాను.
  5.  ఎవరి గురించి నెగిటివ్ ట్వీట్స్ పెట్టను, కామెంట్స్ చేయను
  6.   ఆడవారి వైపు అస్సలు చూడను
  7.   అలాగే వోడ్కా తాగడం కూడా మానేస్తాను

‘ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తానని మీ అందరి మీద ఓటేస్తున్నాను. ఒక్కనా మీదా తప్ప’ అని తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అలాగే అందరికీ ‘హ్యాపీ ఓల్డ్ ఇయర్’ అంటూ వెరైటగా శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘వర్త్ వర్మా వర్త్’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘ఇవి అయ్యే పనులు కాదులే వర్మా’ అంటూ రియాక్ట్ అవుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

ఆర్జీవీ న్యూ ఇయర్ విషెస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి