Mahesh Babu-Rajamouli: రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతేడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Mahesh Babu-Rajamouli: రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్.. ఎప్పుడు స్టార్ట్ కానుందంటే..
Mahesh Babu, SS Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 4:58 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం ప్రీపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం సూపర్ హిట్ తర్వాత మహేష్ తన మేకోవర్, లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇదివరకే మహేష్ న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. జక్కన్న, మహేష్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందించనున్నారని టాక్. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది.. ? ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారంటూ ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే న్యూఇయర్ వేళ జక్కన్న, మహేష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పై కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని జనవరి 2న నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని రాజమౌళి ఆఫీస్ లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుందట.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనుందని టాక్. అలాగే హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో కనిపించనున్నారట.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.