AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది.. కానీ తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యా: జేడీ

హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, డైరెక్టర్ గా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు జేడీ. శివ, ప్రేమ ఖైదీ, మనీ, మనీ మనీ, గులాబి, దెయ్యం, బొంబాయి ప్రియుడు, సత్య తదితర సినిమాలతో జేడీ చక్రవర్తి బాగా ఫేమస్ అయ్యాడు

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది.. కానీ తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యా: జేడీ
Jd Chakravarthy
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 2:15 PM

Share

నటుడు జేడీ చక్రవర్తి.. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. ఒకానొక సమయంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారాడు.  ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు జేడీ చక్రవర్తి. శివ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగుతో పాటు తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొంతకాలం విలన్ గా మెప్పించిన ఆయన ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించాడు. కొంతకాలంగా ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. దివంగత నటి శ్రీదేవి తల్లి జేడీని  శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగిన ఒక గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఆయన పంచుకున్నారు.  శ్రీదేవి కజిన్ మహేశ్వరి ఓ రోజు  జె.డి. చక్రవర్తి, ఆయన తల్లిని భోజనానికి ఆహ్వానించారు. తన ఇల్లు దూరంగా ఉండటంతో శ్రీదేవి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారట. అయితే ఒక్కసారిగా శ్రీదేవి తల్లి జె.డి. చక్రవర్తిని చూసి “మా అమ్మాయిని పెళ్లి చేసుకో” అని అడిగారట. దాంతో ఆయన షాక్ అయ్యారట.. మాములుగా అయితే ఎగిరి గంతేసే మ్యాటర్ అది.. కానీ అసలు విషయం ఏంటంటే..

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

అయితే, ఆ సమయంలో శ్రీదేవి తల్లికి మెదడుకు సంబంధించిన సర్జరీ జరిగిందట, అది తప్పుగా చేయబడటం వల్ల ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆవిడ మనసులో శ్రీదేవికి ఇంకా పెళ్లి కాలేదనే భావన ఉండిపోవడం వల్ల,  అలా వచ్చి జె.డి. చక్రవర్తిని పెళ్లి గురించి అడిగారట. ఈ విషయాన్నీ జేడీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అది జె.డి. చక్రవర్తి తన జీవితంలోని  ఇది ఓ అరుదైన సంఘటన అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us