Tollywood: కళ్లతోనే నటించగల అందమైన అమ్మాయి.. 13 ఏళ్ల వయసులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే..
సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీస్ పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ?
పైన ఫోటోలో కనిపిస్తున్న నాట్యమయూరి సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. ఒకప్పుడు దక్షిణాదిని ఏలేసిన కథానాయిక. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా, అత్తగా కనిపిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన అమ్మడు.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ రమ్యకృష్ణ.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో తనదైన నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. సౌత్ ఇండస్ట్రీలో ఆమె తిరుగులేని స్టార్ ప్రెజన్స్. 13 ఏళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. వెల్లై మనసు సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది.
1990 నుంచి 2000 వరకు దాదాపు పదేళ్లల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దక్షిణాదిలో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలకు అమ్మగా నటిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రమ్యకృష్ణ.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.