Vinod Kambli: ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. వీడియో వైరల్.. అభిమానుల్లో తగ్గని ఆందోళన

క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్ అయ్యాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో కాంబ్లీని చూసి క్రికెట్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Vinod Kambli: ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. వీడియో వైరల్.. అభిమానుల్లో తగ్గని ఆందోళన
Vinod Kambli
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2025 | 6:15 PM

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. థానే లోని ఆకృతి హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. మూత్రపిండాల సమస్యలకు తోడు మెదడులో రక్తం గడ్డకట్టడంతో కాంబ్లీ పరిస్థితి క్షీణించింది. ప్రత్యేక వైద్య బృందం అతనికి చికిత్స అందజేయడంతో అతని ఆరోగ్యం కుదుట పడింది. దీంతో నూతన సంవత్సరం మొదటి రోజున కాంబ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికీ వినోద్ కాంబ్లీ సరిగ్గా నడవలేకపోతున్నాడని ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కొందరు అతని చేయి పట్టుకుని కారులో ఎక్కించడం ఈ వీడియోలో కనిపిస్తోంది . కారులో కూర్చున్న తర్వాత నవ్వుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడీ టీమిండియా మాజీ క్రికెటర్. ‘ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాంబ్లీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏదైనా వ్యసనం మీ జీవితాన్ని నాశనం చేస్తుందన్నాడు.

కాగా డిశ్చార్జ్ సమయంలో వినోద్ కాంబ్లీ టీమ్ ఇండియా జెర్సీని ధరించాడు. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. కాంబ్లీ జెర్సీపై 18 నంబర్ రాసి ఉంది. ప్రస్తుతం టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 నే. అయితే కొంతకాలంగా వినోద్ కాంబ్లీ ఈ జెర్సీ నంబర్‌తోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. వినోద్ కాంబ్లీ భారత్ తరఫున వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1991లో టీమిండియా తరఫున అతను వన్డేల్లో అరంగేట్రం చేశాడు. చివరి వన్డే మ్యాచ్ 2000లో ఆడాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా వినోద్ కాంబ్లిన్ నిలిచాడు. చిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసిన ఘనత కూడా అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

2024 డిసెంబర్‌లో వినోద్ కాంబ్లీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. పైగా, అతని ఆర్థిక పరిస్థితిని చూసి హాస్పిటల్ యాజమాన్యం అతనికి ఉచితంగా చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్ అయినప్పటికీ, అతని పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. రానున్న కాలంలో వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

ఆస్పత్రి నుంచి బయటకు వస్తోన్న కాంబ్లీ.. వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..