Hyderabad: RRR ఉత్తర భాగంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ అంటే..?
ఇండియన్ సినిమాల్లో RRR గేమ్ ఛేంజర్. హైదరాబాద్ చుట్టూ పరుచుకుంటున్న RRR...రీజనల్ రింగ్ రోడ్...భాగ్య నగరానికి సూపర్ గేమ్ ఛేంజర్. RRR ఉత్తర భాగంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు రాబోతున్నాయి. RRR ఉత్తర భాగంలో నిర్మించే 4 లేన్ల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి.
రీజనల్ రింగ్ రోడ్… ఉత్తరభాగంలో నిర్మించే 4 లేన్ల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా.. మన మహానగరంతో పాటు నగర శివార్లలోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లొచ్చు. అంతర్రాష్ట్ర వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ వ్యాపార రంగం మరింత వృద్ధి చెందనుంది. ఇంటర్‌ఛేంజ్‌ల దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి. దీనివల్ల రాబోయే కాలంలో జరగబోయే అభివృద్ధి ఏమిటో తెలుసుకుందాం…
రహదారుల అనుసంధానంతో నెక్ట్స్ లెవెల్‌కు ఆర్థిక ప్రగతి
RRR ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా NHAI దీన్ని నిర్మించనుంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఎన్‌హెచ్ డివిజన్ సూచనలు, సలహాలు కూడా తీసుకుని దీన్ని డిజైన్ చేశారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ప్లాజాలు, రెస్ట్‌రూంలు, సర్వీసు రోడ్లు, బస్‌బేలు, ట్రక్ బేలు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో ఆరు, ఎనిమిది వరుసలుగా పెంచుకునే అవకాశం ఉంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుసంధానంగా వచ్చే 11 జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇంటర్‌ఛేంజ్‌లు ఎలా ఉంటాయో, వాటి ఆకృతులు ఎలా ఉంటాయో చూద్దాం.
—ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం — NH-65 – హైదరాబాద్ – పుణె రోడ్‌కి అనుసంధానం – ఈ రోడ్ సింగిల్ ట్రంపెట్ ఆకృతిలో ఉంటుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –NH-161 – హైదరాబాద్ – నాందేడ్ రోడ్‌తో కనెక్టివిటీ – ఇది డబుల్ ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –NH-765-D – హైదరాబాద్ – మెదక్ రోడ్‌తో లింక్ – ఈ రోడ్ డైమండ్ షేప్‌లో రానుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –NH-44 – హైదరాబాద్ – నాగ్‌పూర్ రోడ్‌తో అనుసంధానం – ఇది క్లోవర్ లీఫ్ షేప్‌లో ఉంటుంది.
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –SH-17 – తూప్రాన్ – గజ్వేల్ రోడ్‌తో కనెక్టివిటీ – ఇది రోటరీ కమ్ ఫ్లైవోర్
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం SH-01 – హైదరాబాద్ – మంచిర్యాల్ రోడ్‌తో లింక్ – ఇది కూడా క్లోవర్ లీఫ్ షేప్‌లో ఉంటుంది.
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –SH-17 – ప్రజ్ఞాపూర్ – భువనగిరి రోడ్‌తో అనుసంధానం – ఇక్కడ రోటరీ కమ్ ఫ్లైవోవర్ వస్తుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –VR – యాదాద్రి – కీసర రోడ్‌తో అనుసంధానం – ఇక్కడ కూడా ఇంటర్ సెక్షన్‌తో పాటు ఫ్లై వోవర్ వస్తుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –NH-163 – హైదరాబాద్ – వరంగల్ రోడ్‌తో కనెక్టివిటీ వస్తుంది – ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ వస్తుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం –MDR – భువనగిరి – నల్గొండ రోడ్‌తో కనెక్ట్ అవుతుంది – ఇక్కడ కూడా రోటరీ కమ్ ఫ్లైవోవర్ వస్తుంది
–ఇంటర్‌ఛేంజ్ ప్రాంతం NH-65 – హైదరాబాద్ – విజయవాడ రోడ్‌తో లింక్ చేస్తారు – ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ వస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..