- Telugu News Photo Gallery Cinema photos Venkatesh and Balakrishna Unstoppable with NBK S4 episode streaming on aha, watch
Venkatesh in Unstoppable: వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఎంతైనా మన తెలుగు హీరోలకు ఉన్నంత యూనిటి ఇంకెవరికీ ఉండదబ్బా..! కావలంటే చూడండి.. రేపు సంక్రాంతికి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు కలిసి ఒకే ప్రోగ్రామ్‌లో ఎంచక్కా మాట్లాడుకున్నారు. అన్‌స్టాపబుల్ 4లో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. బాలయ్యతో కలిసి వెంకీ చేసిన సందడికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. చూస్తున్నారుగా.. బాలయ్య షోలో వెంకటేష్ చేస్తున్న అల్లరి.
Updated on: Dec 29, 2024 | 7:11 PM

ఎంతైనా మన తెలుగు హీరోలకు ఉన్నంత యూనిటి ఇంకెవరికీ ఉండదబ్బా..! కావలంటే చూడండి.. రేపు సంక్రాంతికి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు కలిసి ఒకే ప్రోగ్రామ్‌లో ఎంచక్కా మాట్లాడుకున్నారు.

అన్‌స్టాపబుల్ 4లో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. బాలయ్యతో కలిసి వెంకీ చేసిన సందడికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. చూస్తున్నారుగా.. బాలయ్య షోలో వెంకటేష్ చేస్తున్న అల్లరి.

వచ్చీ రాగానే వెంకీని బాగానే ఆట పట్టించారు బాలయ్య. ఇండస్ట్రీకి నాలుగు స్థంభాలు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు వెంకీ.

ఈ మధ్యలో చిరంజీవి టాపిక్ కూడా వచ్చింది. అక్కడ్నుంచి ఫ్యామిలీ టాపిక్‌లోకి వెళ్లిపోయారు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండక్కి రాబోతున్నారు వెంకటేష్.

అదే పండక్కి బాలయ్య కూడా డాకూ మహరాజ్‌తో రానున్నారు. ఈ ఇద్దరితో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి కూడా అన్‌స్టాపబుల్‌లో మెరిసారు.

అలాగే వెంకీ అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు సైతం ఈ ఎపిసోడ్‌కు వచ్చారు. ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా తండ్రి రామానాయుడు గురించి కూడా ఎమోషనల్ అయ్యారు వెంకీ, సురేష్ బాబు.

ఆ వెంటనే వెంకటేష్ గురించి తెలియని విషయాలు చెప్పుకొచ్చారు సురేష్. డిసెంబర్ 27న సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఎపిసోడ్.




