- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Is Completed Law and Now Tollywood Crazy Heroine Malvika Sharma
Tollywood: లాయర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.. ఎవరంటే..
లాయర్ కావాలని ఎన్నో కలలు కన్న అమ్మాయి.. చివరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటుతుంది. చదివిందేమో లా.. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Dec 30, 2024 | 7:56 AM

2018లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. మొదటి సినిమాతోనే మాస్ మాహారాజా రవితేజత జతకట్టింది. ఆ తర్వాత గోపీచంద్, సుధీర్ బాబు వంటి క్రేజీ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు. మాళవిక శర్మ. తమిళంలో జీవా జోడిగా నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. ఈ అందాల తార అభినయానికి మంచి మార్కులు కొట్టేసింది.ప్రస్తుతం ఈ అమ్మడు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది.

ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక శర్మ అక్కడే చదువుకుంది. ఎల్ఎల్బీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. అదే సమయంలో పలు యాడ్స్ నటించింది.

2018లో రవితేజ ‘నేల టికెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి రెడ్ మూవీలో కనిపించింది. ఈ రెండు సినిమాలు మాళవికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఆ తర్వాత ‘కాఫీ విత్ కాదల్’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపిచంద్ జోడిగా భీమా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సుదీర్ బాబుతో కలిసి హరోం హర మూవీలో నటించింది. నెట్టింట గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.




