01 January 2025
కీర్తి ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. రెమ్యునరేషన్ ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కీర్తి సురేష్.. ఇప్పుడు బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఇటీవలే బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్‌ను అలరించింది. ఇందులో స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ మూవీగా నిలిచింది.
ఇప్పుడు కీర్తి సురేష్ ఏడాది సంపాదన గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఇంతకీ కీర్తి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.
ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్ల పారితోషికం తీసుకునే కీర్తి సురేష్ 2023లో కేవలం సినిమాల నుంచే దాదాపు 25 కోట్లు అందుకుంది.
సినిమాలే కాకుండా ప్రకటనలు, వ్యాపారం, రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా సంపాదిస్తుంది కీర్తి. నివేదికల ప్రకారం కీర్తి ఆస్తులు రూ.120 కోట్లు.
చెన్నైలో విలాసవంతమైన ఇళ్లు ఉంది. అలాగే హైదరాబాద్ లోనూ కీర్తికి లగ్జరీ ఇల్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే పెళ్లి చేసుకుంది.
గతేడాది డిసెంబర్ 12న తన స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకుంది కీర్తి. వీరిద్దరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్