Telangana: లెక్కలు తేలాయ్.. రికార్డు బ్రేక్ చేసిన తెలంగాణ మందుబాబులు

మందుబాబులు... తెగ తాగారు. తాగి ఊగారు. ఎక్సైజ్‌ శాఖకు మాంచి కిక్కిచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్ర తిరగరాశారనుకోండి. ఇట్స్‌ ఏ న్యూ ఇయర్‌ పార్టీ అంటూ చెలరేగిపోయారు మందుబాబులు. పెగ్గుపెగ్గుకి పిచ్చెక్కించారు. ఎక్సైజ్‌ శాఖే బిత్తరపోయేలా మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Telangana: లెక్కలు తేలాయ్.. రికార్డు బ్రేక్ చేసిన తెలంగాణ మందుబాబులు
Wine Shop
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2025 | 6:45 PM

లిక్కర్‌ లెక్కలు. ఎక్సైజ్‌శాఖ చరిత్రలోనే ఎన్నడూ చూడని రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్ర ఖాజానాకు లచ్చిందేవిని తెచ్చిపెట్టింది. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు మద్యం షాపుల యాజమన్యాలు చెబుతున్నాయి. తెలంగాణలో  డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు పెరిగాయి, మొత్తం రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్మినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కల్లో తేలింది. డిసెంబరు 23 నుండి 31 వరకు ముఖ్యంగా అధిక అమ్మకాలు జరిగాయి. ఈ రోజుల్లో బిజినెస్ ఇది రూ. 1,700 కోట్ల మేర జరిగింది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఈ సారి రూ. 200 కోట్ల మేర సేల్స్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆయా తేదీల్లో రోజువారీ విక్రయాల లెక్కలు ఇలా…

    • డిసెంబర్ 23: రూ. 193 కోట్లు
    • డిసెంబర్ 24: రూ.197 కోట్లు
    • డిసెంబర్ 26: రూ. 192 కోట్లు
    • డిసెంబర్ 27: రూ. 187 కోట్లు
    • డిసెంబర్ 28: రూ.191 కోట్లు
    • డిసెంబర్ 30: రూ. 402 కోట్లు
    • డిసెంబర్ 31: రూ. 282 కోట్లు

    పండుగల సీజన్‌, నూతన సంవత్సర వేడుకల కారణంగా విక్రయాలు ఈ స్థాయిలో పెరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

    శభాష్‌…పోలీస్ …..

    తెలంగాణ పోలీసులు ఫిక్స్ అయ్యారు.. ఫిక్స్ చేశారు.. ఇంకేముందీ ఫర్ఫెక్ట్ ప్లానింగ్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను విజయవంతం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే నో క్రైం.. జీరో యాక్సిడెంట్స్.. అవును.. హైదరాబాద్ సిటీలోని కోటికి పైగా ఉన్న జనం.. ఒకే రోజు.. ఒకేసారి వేడుకలు చేసుకుంటారు.. వేలాది ఈవెంట్స్ జరిగాయి. హోటల్స్, బార్లు, పబ్స్, ఫంక్షన్ హాల్స్ ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. అయినా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. పక్కా ప్లానింగ్‌తో పనిచేసిన పోలీస్‌ యంత్రాంగం… విజయం సాధించింది. వారం రోజుల ముందు నుంచే వార్నింగులిస్తుండటం… డిసెంబర్ 31న స్ట్రిక్ట్‌గా రూల్స్‌ అమలు చేయడంతో ఆల్‌ హ్యాపీస్‌ అన్నట్లుగా ఉంది పరిస్థితి.

    మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..