Tollywood : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్.. 49 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిగా..
ఒకప్పుడు బాలనటుడిగా సినీప్రియులను అలరించాడు. ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో అతడు ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన ప్రతిభతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.
సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోల ఫోటోలను చూసి మురిసిపోతుంటారు. తమకు నచ్చిన సినీతారల చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో చిన్ననాటి పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఆ చిన్నోడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ ఒకరు.
దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్.. మొదట్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. తన తండ్రి నటించిన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత యువరాజు, రాజకుమారుడు సినిమాలతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు అద్భుతమైన నటనతో అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు రాజమౌళి ఆఫీస్ లో జరిగాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.