ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా.. మావోయిస్టుల ఘతుకానికి తొమ్మిదిమంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది.. సోమవారం మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు..
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా.. మావోయిస్టుల ఘతుకానికి తొమ్మిది మంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది.. మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సుక్మా జిల్లా కుత్రు అటవీప్రాంతంలో బెద్రే-కుత్రు రోడ్డులో.. సోమవారం మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.. మందుపాతర పేలుడులో 9 మంది మరణించగా.. ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.. పేలుడు సమయంలో వ్యాన్‌లో 15 మంది జవాన్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. దంతేవాడ, నారాయణపూర్ – బీజాపూర్ జిల్లాల నుంచి DRG బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్నారని, ఈ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని బస్తర్ IG తెలిపారు.
ఐదు మృతదేహాలు స్వాధీనం..
ఆదివారం బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మరణించారు. ఆదివారం 4 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. సోమవారం మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఎన్కౌంటర్ నారాయణపూర్ -దంతేవాడ జిల్లాల సరిహద్దు వెంబడి దక్షిణ అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..