AP High Court Jobs: హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, మెరిట్‌ మార్కులు, వైవా వాయిస్‌ వంటి తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను ఈ కింది అడ్రస్ లో సమర్పించవల్సి ఉంటుంది..

AP High Court Jobs: హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎలాంటి రాత పరీక్ష లేదు
AP High Court Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2025 | 4:34 PM

అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలోని హైకోర్టులో.. ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 05 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఐదేళ్లు లేదా మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నింపిన దరఖాస్తులను.. రిజిస్ట్రార్‌, హైకోర్ట్‌ ఆఫ్‌ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్‌ మార్కులు, వైవా వాయిస్‌ తదితరాల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఏపీ హైకోర్టులో క్లర్క్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రైల్వే ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ కీ విడుదల.. జనవరి 11 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు

రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఆర్‌బీ టెక్నీషియన్‌ గ్రేడ్- 3 పరీక్షల ప్రశ్నపత్రం కీని రైల్వే బోర్డు సోమవారం (జనవరి 6) విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను జనవరి 11వ తేదీలోపు దాఖలు చేయవల్సి ఉంటుంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి, ఫలితాలను కూడా వెల్లడించనుంది. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి విడుదలైన ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

రైల్వే ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నేడు, రేపు టీజీపీఎస్సీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌ 1 పరీక్షలు

తెలంగాణ ఉమెన్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ డెవెలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌-1 పోస్టులకు నేడు, రేపు (జనవరి 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లతోపాటు ఏదైనా ఫొటో ఐడెంటిటీ కార్డును తమతోపాటు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లవల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.