Kangana Ranaut: కంగన రనౌత్ సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్.. పట్టించుకోవడం మానేయాలంటూ..
బాలీవుడ్ నటి కంగన రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటౌన్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా
బాలీవుడ్ నటి కంగన రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటౌన్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది కంగన. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కంగన ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిన సంగతే. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తుంది. అయితే పలుమార్లు కంగనా చేసిన పోస్ట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అటు మహారాష్ట్ర ప్రభుత్వానికి.. కంగనాకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అయితే కంగన సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న వివాదాస్పద పోస్టులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది.
తాజాగా కంగనా పోస్టులను అడ్డుకోవాలన్న పిటిషనర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సిక్కులు, ముంబై పోలీసులపై కంగన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్ జిత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. కంగన రనౌత్ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే.. కంగన వ్యాఖ్యలపై దాఖలైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కలిపి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌కు సింగ్ అభ్యర్థించగా.. అలా కోరే అవకాశం కూడా అతడికి లేదని కోర్టు పేర్కొంది. అలా విజ్ఞప్తి చేసే అవకాశం నిందితులకు మాత్రమే ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..