Priyanka Chopra: తల్లైన స్టార్ హీరోయిన్.. సరోగసీ ద్వారా బిడ్డపుట్టినట్లు ప్రకటించిన ప్రియాంక నిక్ దంపతులు

Priyanka Chopra: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), నిక్ జోనాస్ (Nick Jonas)దంపతులు తల్లిదండ్రులయ్యారు. తాను తల్లి అయినట్లు సరోగసీ ద్వారా బిడ్డ..

Priyanka Chopra: తల్లైన స్టార్ హీరోయిన్.. సరోగసీ ద్వారా బిడ్డపుట్టినట్లు ప్రకటించిన ప్రియాంక నిక్ దంపతులు
Priyanka Chopra
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2022 | 7:48 AM

Priyanka Chopra: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), నిక్ జోనాస్ (Nick Jonas)దంపతులు తల్లిదండ్రులయ్యారు. తాను తల్లి అయినట్లు సరోగసీ ద్వారా బిడ్డ పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది ఈ అందాల సుందరి. ప్రియంక చోప్రా, నిక్ లు డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి రెండేళ్లు దాటింది. అయితే ఈ దంపలిద్దరూ ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో పిల్లల గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు తాము ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యమంటూ సడెన్ సర్ప్రైజ్ నిస్తూ నిక్ జోనాస్ , ప్రియాంక చోప్రా తమ సంతోషాన్ని అందరితోను పంచుకున్నారు. వాస్తవానికి వీరు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని నిక్ జోనాస్ , ప్రియాంక చోప్రా లు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిజేశారు.

View this post on Instagram

A post shared by Nick Jonas (@nickjonas)

ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ఇద్దరూ సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించారు. శనివారం, ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తమ అభిమానులు, ఫాలోవర్లతో ఈ శుభవార్తను పంచుకున్నారు. ‘మేము అద్దె గర్భం ద్వారా బిడ్డను స్వాగతించాము. ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము.. కనుక మా ప్రైవసీని గౌరవించండి అంటూ నిక్ సోషల్ మీడియా వేదికగా కోరాడు.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

అయితే ఈ దంపతులు తమకు పుట్టిన శిశివు ఆడ అనే దాని గురించి ఏమీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే స్నేహితులు, ఇతర నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. ప్రియాంక, నిక్ లకు అభినందనల తెలిజేసింది నటి లారా దత్తా భూపతి . అదే సమయంలో, నిర్మాత గుర్నీత్ మోంగా వ్యాఖ్యానిస్తూ, ‘ఓ మై గాడ్, ఇదిశుభవార్త, చాలా ప్రత్యేకమైనది.. అభినందనలు తెలియజేశారు.

ప్రియాంక చోప్రా బెస్ట్ ఫ్రెండ్:

సోషల్ మీడియాలో హఠాత్తుగా చిన్నారి పుట్టింది అని ప్రకటించగానే.. ప్రియాంకకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రియాంక చోప్రా తను తల్లిని అయ్యాను అంటూ శుభవార్త పంచుకున్న తర్వాత.. ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ సింగ్,.. నేను నిన్ను కౌగిలించుకోవడానికి వేచి ఉండలేను’ అని తన సంతోషాన్ని ప్రకటించింది.

Also Read:

మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..