Jai Bheem: చైనాలో సైతం దుమ్మురేపిన జైభీమ్.. అసలు భారత సినిమాలకు చైనాలో ఎందుకింత ఆదరణ.. విశ్లేషణాత్మక కథనం..
Jai Bheem: జైభీమ్.. గతేడాది చిత్ర పరిశ్రమలో ఈ పేరు పెద్ద ఎత్తున వినిపించింది. తమిళనాడులో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మారుమోగింది. అనగారిన వర్గానికి చెందిన అమాయకుడిపై పోలీసులు తప్పుడు దొంగతనం ఆరోపణలతో...
Jai Bheem: జైభీమ్.. గతేడాది చిత్ర పరిశ్రమలో ఈ పేరు పెద్ద ఎత్తున వినిపించింది. తమిళనాడులో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మారుమోగింది. అనగారిన వర్గానికి చెందిన అమాయకుడిపై పోలీసులు తప్పుడు దొంగతనం ఆరోపణలతో దాష్టికానికి దిగితే అతని తరఫున పోరాటం చేసిన న్యాయవాది నిజ జీవితాన్ని ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
IMDBలో ఏకంగా 9.8 రేటింగ్‌ను సాధించి ఒక్కసారి దేశం దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. తమిళనాడులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ఇక తాజాగా జైభీమ్ చిత్రం చైనాలోనూ విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మీడియా సమీక్ష ప్లాట్‌ఫామ్ అయిన డౌబన్‌లో 8.7 రేటింగ్‌ను దక్కించుకొని చైనీయులను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. జపాన్‌లో హత్యకు గురైన తన కుమార్తెకు న్యాయం చేసేందుకు చైనాకు చెందిన ఓ తల్లి చేసిన పోరాటాన్ని జైభీమ్ కథ పోలి ఉండడంతో ఈ సినిమాపై అక్కడ కూడా క్యూరియాసిటీ ఏర్పడింది.
ఇదిలా ఉంటే చైనాలో ఇండియన్ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ దంగల్, బాహుబలితో పాటు మరెన్నో చిత్రాలు చైనీయులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే చైనాకు చెందిన బ్రూస్‌లీ చిత్రాలు సైతం ఇండియన్స్‌ను అట్రాక్ట్ చేశాయి. సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ భారత దేశానికి చెందిన కథలు చైనీయులకు, చైనా సినిమాలకు భారతీయులను ఇంతలా ఎందుకు ఆకర్షిస్తున్నాయి. అసలు ఇండియన్ సినిమా చైనాలో ఓ వెలుగు వెలుగుతుండడానికి కారణలేంటన్న దానిపై విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం..
భారత్, చైనాలు రెండు విభిన్న సంస్కృతులు, సామాజిక నేపథ్యాలు ఉన్న దేశాలు. భాషా పరమైన తేడాలు, అలాగే హిమాలయాలు రెండు దేశాలను విభజిస్తాయి. అయితే సినిమా మాత్రం రెండు దేశాలను కలుపుతూనే ఉంది. చైనాకు చెందిన చిత్రాలు భారత్‌లో ఎప్పటి నుంచే సందడి చేస్తూ నేఉన్నాయి. సుమారు 3 దశాబ్దాల క్రితమే బ్రూస్‌లీ చిత్రాలు ఇండియాలో సంచలనం సృష్టించాయి. ఆ కాలం నాటి ఎంతో మంది యువకులు బ్రూస్‌లీకి అభిమానులుగా కూడా మారిపోయారు. ఇక గడిచిన కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలకు సైతం చైనాలో భారీగా ఆదరణ పెరుగుతోంది. త్రీ ఇడియట్స్, లాగాన్, పీకే, తారే జమీన్ పర్, దంగల్, ధూమ్ 3, దంగల్ వంటి చిత్రాలు చైనాలో భారీ విజయాన్ని దక్కించుకున్నాయి.
దంగల్ ఒక్క చిత్రమే చైనాలో ఏకంగా రూ. 1300 కోట్లు వసూళ్లు చేసింది. ఇవన్నీ అమీర్ ఖాన్ చిత్రాలే కావడం గమనార్హం. దాదాపు ఈ అన్ని చిత్రాల్లో సమాజంలో ఉన్న సమస్యలను ఇతి వృత్తంగా తీసుకొని తెరకెక్కించినవే. చైనాకు చెందిన షి వెన్స్కూ అనే సినిమా క్రిటిక్ భారతీయ సినిమాల గురించి మాట్లాడుతూ.. భారతీయు సినిమాల్లో సాంస్కృతిక ఔన్నత్వాన్ని ఎలివేట్ చేసేలా ఉంటాయి. సినీ నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏది ఏమైనా మంచి కథనంతో కూడిన చిత్రాలు కంచెలతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని చూరగొంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
Bhavana: ఫొటోషూట్లతోనే ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్న భావన లేటెస్ట్ పిక్స్
Viral Video: వామ్మో.. పెళ్లి వేదికపైనే వరుడికి చుక్కలు చూపించిన వధువు.. వీడియో వైరల్