Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కూడా కేబినెట్ చర్చించింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆమోదం లభించింది.

Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
Ap Cabinet Decisions
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2022 | 3:20 PM

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కారుణ్య నియామకాలు జరపాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Also Read: Hyderabad: తీవ్ర విషాదం.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!