Mirchi Looty: కేటుగాళ్లు రైతులనూ వదలడం లేదు.. ఆరుగాలం పండించి పంటలను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు..

Mirchi Looty: ప్రపంచ వ్యాప్తంగా గుంటూరు మిర్చికి ఎంత పేరుందో అందరికి తెలిసిందే. ఘాటు మిర్చి సాగుకు గుంటూరు పెట్టింది పేరు.

Mirchi Looty: కేటుగాళ్లు రైతులనూ వదలడం లేదు.. ఆరుగాలం పండించి పంటలను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 21, 2022 | 3:01 PM

Mirchi Looty: ప్రపంచ వ్యాప్తంగా గుంటూరు మిర్చికి ఎంత పేరుందో అందరికి తెలిసిందే. ఘాటు మిర్చి సాగుకు గుంటూరు పెట్టింది పేరు. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో లక్షా నలభై వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. అయితే తామర పురుగు పట్టడంతో మిర్చి దిగుబడి లేకుండా పోయింది. దీంతో మిర్చికి డిమాండ్ భారీగా పెరిగింది. అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే ఎకరానికి పది క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. వచ్చిన పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ రైతులు వాటిని కోల్డ్ స్టోరేజ్ లకు తరలిస్తున్నారు. అయితే మిర్చికి డిమాండ్ ఉందన్న సంగతి తెలుసుకున్న దొంగలు కళ్ళాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగలించే పనిలో పడ్డారు.

నాదెండ్ల మండలం నాదెండ్లకు చెందిన రైతు కొరివి కోటేశ్వరరావు పొలంలో లక్ష రూపాయల విలువైన మిర్చి ఎండబెడుతున్నారు. బుధవారం రాత్రి మిర్చిని కుప్పగా పోసి పట్టా కప్పి రాత్రి పదకొండు గంటల వరకూ కాపలా ఉన్నాడు. అర్థరాత్రి ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున కళ్లం దగ్గరకు తిరిగి వచ్చి చూస్తే కళ్లంలో మిర్చి కుప్ప తగ్గిపోయి ఉంది. కప్పలో కొంత భాగాన్ని తీసుకెళ్ళినట్లు అర్థమై దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇదే విషయాన్ని నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత రైతు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, డబ్బు, విలువైన వస్తువులను మాత్రమే దొంగలించే దొంగలను ఇప్పటివరకూ చూశాం. ఇక ముందు మిర్చి దొంగలను తరచుగా చూడాల్సి వస్తుందేమోనని రైతులు వాపోతున్నారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9, గుంటూరు.

Also read:

Hyderabad: తీవ్ర విషాదం.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య

Railway Jobs: ఐటీఐ ఉత్తీర్ణ‌తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌..

Telangana: జగిత్యాలలో దారుణం.. మంత్రాల నెపంతో ముగ్గురి హతం.. అసలు కుట్ర వేరే ఉందా?..