AP Politics: కేసినో రచ్చ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ.. మధ్యలో పోలీసులు.. గుడివాడలో హైటెన్షన్..
Casino - Minister Nani: గుడివాడలో కేసిన నిర్వహణకు సంబంధించిన ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన
Casino – Minister Nani: గుడివాడలో కేసిన నిర్వహణకు సంబంధించిన ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ గుడివాడకు బయలుదేరింది. అయితే, గుడివాడకు చేరుకోక ముందే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు దగ్గరకు చేరుకోగానే.. టీడీపీ నేతల వాహనాలను నిలిపివేశారు పోలీసులు. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎందుకు అనుమతించరంటూ నిలదీశారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత టీడీపీ నేతలను వదిలేశారు అధికారులు. ప్రస్తుతానికి గడివాడకు దగ్గరలో ఉంది టీడీపీ బృందం.
కేసినో వ్యవహారంలో అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీ గుడివాడకు బయలుదేరింది. ఈ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉన్నారు. ఇదిలాఉంటే.. టీడీపీ ఏంటి? నిజనిర్ధారణ ఏంటీ? అంటోంది వైసీపీ క్యాడర్. వారెలా వస్తారో చూస్తామంటూ వైసీపీ కార్యకర్తలూ రివర్స్ అవుతున్నారు. కె. కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇలా రెండు వర్గాల పోటాపోటీ యాక్షన్ ప్లాన్‌తో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో గుడివాడలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు గుడివాడ ప్రజలు భయాందోళనతో ఉన్నారు.
సంక్రాంతి వేళ గుడివాడ కె.కన్వెషన్‌లో జరిగిన సందడిపై టీడీపీ, బీజేపీ విమర్శలు చేస్తున్నాయి. ఆ రోజు అక్కడ కేసినో నిర్వహించారని, ఒక్క రాత్రిలో మంత్రి కొడాలి నాని వర్గం రూ. 250 కోట్లు సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. గోవా, వేగాస్ కల్చర్‌ను గుడివాడకు తెచ్చారంటూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కె.కన్వెషన్ ఓనర్ కొడాలిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also read:
Nirmala Sitaraman: నిర్మలమ్మ బడ్జెట్‌కు తుది మెరుగులు.. నాలుగోసారి తెలుగింటి కోడలు ఘనత
Budget 2022: గృహ కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు..!