Nirmala Sitaraman: నిర్మలమ్మ బడ్జెట్‌కు తుది మెరుగులు.. నాలుగోసారి తెలుగింటి కోడలు ఘనత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు బడ్జెట్ తొలి సెషన్ నిర్వహించనున్నారు.
Union Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు బడ్జెట్ తొలి సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. బడ్జెట్ రూపకల్పనను దాదాపుగా పూర్తి చేసిన నిర్మలా సీతారామన్.. దీనికి తుది మెరుగులు దిద్దడంలో తలమునకలయ్యారు. థర్డ్ వేవ్‌లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. దేశ చరిత్రలో నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించనున్నారు.
నిర్మలమ్మ తన నాలుగో బడ్జెట్‌లో ఏయే రంగాలకు నిర్మలమ్మ ఊరట కలిగిస్తారు? వ్యవసాయ, ఆరోగ్య, పారిశ్రామిక రంగాలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయి? కరోనా కష్టకాలంలో పన్ను మినహాయింపులు ఉంటాయా? తదితర అంశాలు ఆసక్తిరేపుతున్నాయి.
Watch Video: ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల..
నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ..
కేంద్ర కేబినెట్‌లో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అలాగే స్వతంత్ర భారతావనిలో ధివంగత ఇందిరా గాంధీ తర్వాత దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె 2019లో ఘనత సాధించారు. ఇందిరా గాంధీ 1970లో దేశ వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. ఇప్పటి వరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టిన ఏకైక మహిళ నిర్మలా సీతారామన్ కావడం విశేషం. వచ్చే నెల 1న నాలుగో సారి ఆమె పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్..
2019 నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటుకున్నారు. సేల్స్ 1959 ఆగస్టు 19న తమిళనాడులోని తిరుచ్చిలో ఆమె జన్మించారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకున్న నిర్మలా సీతారామన్.. తెలుగింటి కోడలు అయ్యారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు.
Also Read..
Budget 2022: గృహ కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు..!