Beetroot in Winters: చలికాలంలో సూపర్ ఫుడ్ బీట్ రూట్.. రోజు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

Beetroot in Winters: బీట్‌రూట్ (Beetroot) ఒక సూపర్ ఫుడ్. పోషక విలువలతో నిండి ఉంటుంది. బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గాకూడా పిలుస్తారు. ఎందుకంటే సూపర్‌ఫుడ్‌లో సగటు కంటే ఎక్కువ ఖనిజాలు..

Beetroot in Winters: చలికాలంలో సూపర్ ఫుడ్ బీట్ రూట్.. రోజు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
Beetroot In Winters
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2022 | 10:27 AM

Beetroot in Winters: బీట్‌రూట్ (Beetroot) ఒక సూపర్ ఫుడ్. పోషక విలువలతో నిండి ఉంటుంది. బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గాకూడా పిలుస్తారు. ఎందుకంటే సూపర్‌ఫుడ్‌లో సగటు కంటే ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి కనుక సూపర్ పుడ్ లో బీట్‌రూట్ అగ్రస్థానంలో ఉంది. బీట్ రూట్ లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం సరిగా సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్ రూట్ శీతాకాలపు వెజిటేబుల్.. ఎందుకంటే ఇది చలికాలంలో ఆరోగ్యంగా , వేడిగా ఉండేలా చేస్తుంది. దీనిని సలాడ్ రూపంలో, ఉడికించి, కాల్చి లేదా పచ్చిగా తినవచ్చు.

చలికాలంలో బీట్‌రూట్ ను ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయి. వీటిని బీటాలైన్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు బీట్ రూట్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డిటాక్సిఫికేషన్ లక్షణాలు ఉంటాయి. చలికాలంలో శక్తిని , రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల కోసం చూసేవారికి బెస్ట్ ఎంపిక బీట్‌రూట్. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన రక్తనాళాలు, మెదడు పనితీరుతో సంబంధం ఉన్న నోటి బ్యాక్టీరియా మిశ్రమాన్ని ప్రోత్సహిస్తుందని ఒక కొత్త అధ్యయనంలో తెలిసింది. ఈ అధ్యయనం ఫలితాలు ‘రెడాక్స్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి

శీతాకాలంలో బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

బీట్ రూట్ జ్యూస్ అత్యంత ప్రభావవంతమైన డిటాక్స్ పానీయాలలో ఒకటి. కాలేయ కణాలను ఉత్తేజపరుస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను బయటకు పంపుతుంది. జ్యూస్‌లోని గ్లైసిన్, బీటైన్.. శరీరంలో కొవ్వు ఆమ్లాలు పేరుకుపోకుండా నిరోధిస్తాయి.

జుట్టు పెరుగుదల: జుట్టు రాలుతుందని ఇబ్బంది పడుతుంటే..రోజువారీ ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకోవాలి. ఈ దుంప రసం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఈ పోషకం చాలా అవసరం. కనుక బీట్ రూట్ రసం జుట్టు పెరుగుదలకు మంచి సహాయకారి.

గుండెకు మంచిది: అనేక అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.అంతేకాదు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు ఉన్నవారికి కూడా మంచి మెడిసిన్ బీట్ రూట్ జ్యూస్. బీట్‌రూట్ రసంలో నైట్రేట్ ఉంటుంది. ఇది నాళాల్లో చేరుకొని రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కోవిడ్-19, సీజనల్ వ్యదులైన ఫ్లూ వంటివి దరి చేరకుండా మంచి రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. బీట్‌రూట్ లో విటమిన్ ఎ & సితో పాటు బీటైన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియంలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది: బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ దుంప రసం మచ్చలు, పిగ్మెంటేషన్లను తగ్గిస్తుంది. చర్మపు రంగును నిగారించేలా చేస్తుంది.

Also Read:

Weight Loss Diet: ఆకుకూరలతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!