Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Semiconductor: ముందుకొస్తున్న కంపెనీలు.. మరో రెండేళ్లలో అందుబాటులోకి దేశీయ సెమీకండక్టర్లు..!

దేశంలో సెమీకండక్టర్ కొరత చాలా ఉంది. ఈ కొరతతో ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది...

Semiconductor: ముందుకొస్తున్న కంపెనీలు.. మరో రెండేళ్లలో అందుబాటులోకి దేశీయ సెమీకండక్టర్లు..!
Semiconductor
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 21, 2022 | 10:05 AM

దేశంలో సెమీకండక్టర్ కొరత చాలా ఉంది. ఈ కొరతతో ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో కీలకమైన ‘చిప్‌సెట్‌’లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ పథకం ఆవిష్కరించింది. సెమీకండక్టర్‌ పీఎల్‌ఐ విధానం తీసుకోచ్చింది. ఈ విధానం దిగ్గజ కంపెనీల్లో కదలిక తీసుకువచ్చింది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి, ‘చిప్‌’లు ఉత్పత్తి చేయడంతో పాటు,డిజైన్‌- టెస్టింగ్‌ సేవలను ఆవిష్కరించేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే టాటా ఆ దిశగా చర్యలు చేపట్టింది. వేదాంతా గ్రూపు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయగా, కొన్ని విదేశీ సంస్థలు కూడా ప్రభుత్వంతో సంప్రదింపులకు ముందుకు వస్తున్నాయని తెలుస్తుంది. దేశీయంగా పలు చిన్న, మధ్యతరహా ఎలక్ట్రానిక్‌, సెమీకండక్టర్‌ కంపెనీలు కూడా కొత్త అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే సాఫ్ట్​ వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీలో నైపుణ్యం అధికంగా ఉన్నందున, చిప్‌ డిజైనింగ్‌ సేవలు మొదలుపెట్టి, అందులో అగ్రగామిగా మారే అవకాశం మనదేశానికి ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రం ప్రకటించిన సెమీకండక్టర్‌ విధానం కింద రాయితీల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించింది. సెమీకండక్టర్‌, సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమైన 100 దేశీయ కంపెనీలను ప్రభుత్వం గుర్తించి, పీఎల్‌ఐ పథకం కింద రాయితీలు పొందేలా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో రెండేళ్లలో దేశీయ అవసరాలకు కావాల్సిన సెమీకండక్టర్లు ఉత్పత్తి కావచ్చని తెలుస్తోంది.

చిప్ పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా 4 రకాల కార్యకలాపాలు చేపట్టే సంస్థలను ఎంపిక చేస్తారు. సీఎంఓఎస్‌ (కాంప్లిమెంటరీ మెటల్‌ ఆక్సైడ్‌ సెమీకండక్టర్‌) డిస్‌ప్లే ఫ్యాబ్‌, కాంపౌండ్‌ సెమీకండక్టర్‌ ఫ్యాబ్స్‌ అండ్‌ ఏటీఎంపీ (ప్యాకేజింగ్‌ అండ్‌ టెస్టింగ్‌) యూనిట్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also.. Petrol Diesel Price: హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. తగ్గాయా.. పెరిగాయా..