Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..!
వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ శుక్రవారం కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ శుక్రవారం కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా తగ్గాయి. సెన్సెక్స్ 353 పాయింట్లు క్షీణించి 59 వేల 77 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 17 వేల 637 వద్ద కొనసాగుతోంది.
ఎంఫసిస్, డెల్ట కర్ప్, హిందుస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఎన్టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ లాలు పాత్ల్యాబ్, బజాజ్ న్సర్వ్ నష్టాల్లో ట్రేడ్అవుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also.. Semiconductor: ముందుకొస్తున్న కంపెనీలు.. మరో రెండేళ్లలో అందుబాటులోకి దేశీయ సెమీకండక్టర్లు..!