Petrol Diesel Price: హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. తగ్గాయా.. పెరిగాయా..

ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శుక్రవారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌..

Petrol Diesel Price: హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. తగ్గాయా.. పెరిగాయా..
Follow us

|

Updated on: Jan 21, 2022 | 8:44 AM

Petrol-Diesel Rates Today: పెట్రో మంటలకు బ్రేక్ పడింది. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శుక్రవారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. అవును, క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూనే మరోవైపు 78 రోజులుగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.86గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.36 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.47గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.84లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

PPF: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. ప్రతి నెల రూ.12,500 డిపాజిట్‌తో చేతికి రూ.1 కోటి వరకు.. పూర్తి వివరాలు