PPF: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. ప్రతి నెల రూ.12,500 డిపాజిట్‌తో చేతికి రూ.1 కోటి వరకు.. పూర్తి వివరాలు

చేతిలో డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్నో ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్‌ పొందే పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..

PPF: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. ప్రతి నెల రూ.12,500 డిపాజిట్‌తో చేతికి రూ.1 కోటి వరకు.. పూర్తి వివరాలు
Ppf
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 21, 2022 | 7:58 AM

Public Provident Fund: చేతిలో డబ్బులు ఉండి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్నో ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్‌ పొందే పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్‌ కూడా ఒకటి. ఈ పథకంలో ఎలాంటి రిస్క్‌ ఉండదు. ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు. అందుకే ప్రభుత్వ పథకాలు పెట్టుబడికి గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీకు మంచి రాబడి వచ్చే చోట, మీ డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. ఈ స్కీమ్‌లలో చాలా వరకు.. తక్కువ మొత్తంతో పెట్టుబడిని పెట్టవచ్చు. పెద్ద కార్పస్‌ను భవిష్యత్తు కోసం రెడీ చేసుకోవచ్చు. ఈ రోజు అలాంటి ఓ ప్రభుత్వ పథకం గురించి తెలసుకుందాం.. ఈ స్కీం ద్వారా మీరు మెచ్యురిటీ వరకు రూ. 1 కోటి వరకు పొందవచ్చు. ఈ పథకం పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). మీరు ఈ పథకాన్ని పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకోవచ్చు.

కేవలం రూ. 500 మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు

కేవలం రూ. 500తో PPFలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మీరు ఈ ఖాతాలో ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు, నెలకు గరిష్టంగా రూ. 12,500 పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీకు మంచి రాబడి వస్తుంది. ఇది కాకుండా వడ్డీ రేట్లు కూడా బాగున్నాయి. PPF  మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు, కానీ మీరు దానిని 5-5 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు.

మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?

కేంద్ర ప్రభుత్వ ఈ పథకంపై ప్రస్తుతం పెట్టుబడిదారులు 7.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం మార్చి తర్వాత ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తుంది. ఇది కాకుండా, మీరు మీ స్వంత పేరుతో లేదా మైనర్ సంరక్షకుడిగా PPF ఖాతాను తెరవవచ్చు.

పన్ను మినహాయింపు ప్రయోజనం:

ఈ పథకంలో పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందుతారు. మీరు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..