Trains Cancelled: కోవిడ్ విజృంభణ.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైళ్లన్నీ రద్దు..

South Central Railway: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా.. కేసులు మూడు లక్షల

Trains Cancelled: కోవిడ్ విజృంభణ.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైళ్లన్నీ రద్దు..
Trains
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2022 | 3:10 PM

South Central Railway: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా.. కేసులు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. అంతేకాకుండా ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి 24 వరకు కొన్ని 55 ప్యాసింజర్ రైళ్ల (Trains) ను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. సిబ్బంది, లోకో పైలెట్ల కొరతతో రైళ్లు రద్దు చేసినట్లు వార్తలు రావడంపై శుక్రవారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు ఈ సర్వీసులకు ప్రయాణీకులు లేరని.. అందుకే 55 రైళ్ల ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. సిబ్బంది, లోకో పైలెట్లు కొరతతోనే రైళ్ల రద్దు అనేది వాస్తవం కాదని.. రాకేష్ వివరించారు.

ఇదిలాఉంటే.. దేశంలో నిన్న 3,47,254 కరోనా కేసులు నమోదు కాగా.. 703 మంది మరణించారు. వైరస్ నుంచి 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,85,66,027 చేరింది. ‬మొత్తం మరణాలు 4,88,396కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 20,18,825 ‬యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఒమిక్రాన్​ కేసులు సంఖ్య కూడా పెరుగుతున్నాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read:

Viral Video: వామ్మో.. పెళ్లి వేదికపైనే వరుడికి చుక్కలు చూపించిన వధువు.. వీడియో వైరల్

UP Assembly Elections 2022: రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..