Republic Day: ఆంధ్రప్రదేశ్ కళాకారుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కలంకారీ పెయింట్స్ ప్రదర్శన.

Republic Day Celebrwtions: దేశ రాజధాని డిల్లీ 7౩వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) ముస్తాబవ్తుతోంది. ఈ వేడుకలను కరోనా (Corona) నిబంధనల నడుమ నిర్వహించడానికి..

Republic Day: ఆంధ్రప్రదేశ్ కళాకారుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కలంకారీ పెయింట్స్ ప్రదర్శన.
Republic Day Celebrations At Rajpath
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2022 | 12:01 PM

Republic Day Celebrwtions: దేశ రాజధాని డిల్లీ 7౩వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) ముస్తాబవ్తుతోంది. ఈ వేడుకలను కరోనా (Corona) నిబంధనల నడుమ నిర్వహించడానికి కేంద్రం రెడీ అవుతోంది. అయితే ఈ ఏడాది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశాన్ని తెలుగు కళాకారుడు దక్కించుకున్నాడు. వేడుకలలో భారీ కలంకారీ తెరలపై తెలుగు కళాకారుడి చిత్రాలు కనువిందు చేయనున్నాయి. భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెప్పే జానపద కళారూపాలు సహా కళలను ప్రదర్శించేలా ఏర్పాటు చేసిన వేడుకల్లో పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో తయారైన భారీ స్క్రోల్ లను ఈ వేడుకల్లో వేడుకల్లో ప్రదర్శించనున్నారు.

రాజ్‌పథ్‌లోని బహిరంగ గ్యాలరీలో, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA) లో ఈ భారీ తెరలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 500 మందికి పైగా కళాకారులు చిత్రించిన అనేక కళారూపాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. ఒకొక్కటి 750 మీటర్ల పొడవున్న భారీ స్క్రోల్‌లను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపంనికి కూడా చోటు దక్కింది.

Republic Day Celebrations 2

Republic Day Celebrations 2

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కలంకారీ కళ తెరపై ఉంటుంది. సుధీర్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న సంప్రదాయ కలంకారి కళాకారుడు. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుండి చిత్రలేఖనంలో విజువల్ ఆర్ట్స్ (BVA)లో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.

Republic Day Celebrations 1

Republic Day Celebrations 1

కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ వస్త్రంపై చేసే పురాతన శైలి చేతి పెయింటింగ్. కలంకారీ అనే పదం ఒక పర్షియన్ పదం నుండి ఉద్భవించింది. ‘కలం’ అంటే కలం మరియు ‘కరి’ అనేది హస్తకళను అనే పదం కళాత్మకతను సూచిస్తుందని చరిత్రకారులు చెబుతారు. ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ మొదలైన 23 శ్రమతో కూడిన దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లలో మహాభారతం , రామాయణం వంటి హిందూ ఇతిహాసాలలోని దైవిక పాత్రలతో పాటు పువ్వులు, నెమలి, ఏనుగులు ఇలా అనేక చిత్రాలు విస్తరించి ఉంటాయి. ప్రస్తుతసం నేటి జనరేషన్ లో ఎక్కువగా ఈ కళ కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు.

Also Read:  67 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి.. అతని ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లు చూసి శాస్త్రవేత్తలు షాక్