UP Assembly Elections 2022: రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..

UP Assembly Elections 2022: రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..
Rahul Gandhi And Priyanka Gandhi Launch Up Youth Manifesto

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా "యూత్ మేనిఫెస్టో"ను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా శుక్రవారం రిక్రూట్‌మెంట్ చట్టాన్ని విడుదల..

Sanjay Kasula

|

Jan 21, 2022 | 1:29 PM

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా “యూత్ మేనిఫెస్టో”ను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా శుక్రవారం రిక్రూట్‌మెంట్ చట్టాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు, యువతపై కాంగ్రెస్ భారీ ఎత్తున ఫోకస్ పెట్టింది. మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. యూపీ యువతకు ఉపాధి కల్పించడమే తమ పార్టీ యూత్ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఉత్తర ప్రదేశ్ యువకులు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే అంశాన్ని ఈ మేనిఫెస్టోలో కోడ్ చేశామన్నారు. ఈ మేనిఫెస్టోను తయారు చేసేందుకు పార్టీ యూపీ యువతతో మాట్లాడి.. వారి ఆకాంక్షలను అందులో పొందుపర్చినట్లుగా వెల్లడించారు. దేశంలోని యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారని..  అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసంటూ విమర్శించారు.

20 లక్షల ఉద్యోగాల హామీ

యూపీ యువతతో మాట్లాడి రూపొందించిన మేనిఫెస్టో ఇదని ప్రియాంక అన్నారు. ఇందుకోసం మా బృందం మొత్తం రాష్ట్ర యువతతో మాట్లాడింది. అందుకే దీన్ని రిక్రూట్‌మెంట్ లెజిస్లేషన్ అంటున్నామని వెల్లడించారు. ఎందుకంటే అతిపెద్ద సమస్య రిక్రూట్‌మెంట్‌… రాబోయే రోజుల్లో  20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. యువతలో ఉత్సాహం వీగిపోయిందన్నారు. యువతలో విశ్వాసాన్ని నింపడం.. ఉపాధి కల్పించడంలో వారికి ఎలా సహాయం చేస్తామో హామీ ఇవ్వాలనుకుంటున్నామన్నారు.

ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ..

ఈ రిక్రూట్‌మెంట్ చట్టంలో ఐదు సెక్షన్లు ఉన్నాయని.. ఇందులో యువత వివిధ సమస్యలపై దృష్టి పెట్టామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారు. సెకండరీ, ఉన్నత విద్య, పోలీసు తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. సంస్కృత ఉపాధ్యాయులు, ఉర్దూ టీచర్లు, అంగన్‌వాడీలు, ఆశా తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, అన్ని పరీక్షా ఫారమ్‌ల ఫీజులు మినహాయించబడతాయి మరియు బస్సు, రైలు ప్రయాణం ఉచితం.

పరీక్షల క్యాలెండర్ విడుదల అవుతుంది

పరీక్ష క్యాలెండర్‌ను విడుదల చేస్తాం.. అందులో రిక్రూట్‌మెంట్ ప్రకటన.. పరీక్ష, నియామక తేదీలను నమోదు చేస్తామన్నారు. ఒకవేల అలా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల స్కామ్‌ను అరికట్టడానికి ప్రతి రిక్రూట్‌మెంట్‌కు సామాజిక న్యాయ పర్యవేక్షకులు ఉంటారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త అవకాశాలు కల్పిస్తామన్నారు. మల్లాలు, నిషాదుల కోసం ప్రపంచ స్థాయి సంస్థను ఏర్పాటు చేసి అందులో వారికి శిక్షణ ఇస్తారు. అత్యంత వెనుకబడిన కమ్యూనిటీ యువత తమ వ్యాపారం ప్రారంభించడానికి 1 శాతం వడ్డీకి రుణం ఇవ్వబడుతుంది.

యువతను డ్రగ్స్‌ ఉచ్చు నుంచి బయటపడేయాలన్నారు

డ్రగ్స్ ఉచ్చు నుంచి యువత బయటపడాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పాడితే.. ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది యువతకు కౌన్సెలింగ్ ఇస్తుందని తెలిపారు. అంతే కాకుండా సాంస్కృతిక రంగంలో యువతను ప్రోత్సహించాన్నారు.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu