Telangana: జగిత్యాలలో దారుణం.. మంత్రాల నెపంతో ముగ్గురి హతం.. అసలు కుట్ర వేరే ఉందా?..
Telangana: జగిత్యాల టీఆర్ నగర్‌లో మంత్రాల నెపంతో ముగ్గురిని నిట్టనిలువునా చంపేసిన కేసులో పోలీసులు మోహరించాల్సిన
Telangana: జగిత్యాల టీఆర్ నగర్‌లో మంత్రాల నెపంతో ముగ్గురిని నిట్టనిలువునా చంపేసిన కేసులో పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామంలో కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా ఏకమై ముగ్గుర్ని పొట్టున పెట్టుకున్నారు. చనిపోయిన ఆ ముగ్గురి హత్య వెనుక ఆరుగురు ఉన్నారన్నది పోలీసుల లెక్క. చనిపోయిన వాళ్లకు కాసేపట్లో జగిత్యాలలోనే పోస్టుమార్టం జరగబోతోంది. ఆ తర్వాత మృతదేహాలను టీఆర్‌నగర్‌కు తరలిస్తారు. అక్కడ పరిస్థితులు గాడి తప్పకుండా పోలీసులు ముందుగానే మోహరించారు.
చనిపోయిన వ్యక్తులపై గతంలోనూ సిరిసిల్లలో ఎటాక్ జరిగిందని చెబుతున్నారు. దానికీ ఈ హత్యలకూ లింకుందా? అప్పట్లో ఎందుకు ఎటాక్ చేశారు?.. ఎవరు ఎటాక్ చేశారు? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. అసలు మర్డర్స్‌కు మంత్రాలే కారణమా? లేక ఆ సాకుతో హత్యలు చేశారా? అన్నది తేలాల్సి ఉంది.
మంత్రాలు చేసి చంపుతున్నారనే కారణంతో నాగేశ్వరరావును ఆయన ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేష్ లను దారుణంగా నరికి చంపారు. బడిసెలు, కత్తులతో మెడలు కోసి, పారిపోయారు దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల బంధులు ఈ హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చంపారని ఆరోపిస్తున్నారు. మంత్రాల నెపంతో దారుణానికి ఒడిగట్టారంటూ వాపోతున్నారు. మరి ఈ కేసును పోలీసులు ఏ విధంగా చేధిస్తారో వేచి చూడాలి.
Also read:
Viral Video: మేక కోసం ప్రాణాలకు తెగించి బోరు బావిలోకి దూరాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Hansika Motwani: హంసలా మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోస్
PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..