PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..

Global Leaders - PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. ప్రపంచ నేతల్లో మోదీ చరిష్మా ఇంకా కొనసాగుతూనే

PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చార్‌ధామ్‌ కేదార్‌నాథ్ ఆలయాన్ని ఫొటోస్.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 21, 2022 | 2:39 PM

Global Leaders – PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. ప్రపంచ నేతల్లో మోదీ చరిష్మా ఇంకా కొనసాగుతూనే ఉందని.. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతానికి పైగా ఉందని పేర్కొంది. అయితే.. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. ఆయన్ను చాలామంది నాయకుడిగా అభివర్ణించడం లేదని పేర్కొంది. కాగా.. ప్రపంచ నేతలకు సంబంధించిన ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. మోర్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మోదీ అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి.

అయితే.. ఈ మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని పలు దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తోంది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 దగ్గర నిలిచిపోయింది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి.

ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల అభిప్రాయాన్ని పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటనలో తెలిపింది. ఈ అధ్యయనంలో పలు దేశాలకు సంబంధించిన వారు పాల్గొన్నట్లు తెలిపింది.

ప్రపంచ నాయకుల రేటింగ్‌ జాబితా: నరేంద్ర మోదీ: 71% ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్: 66% మారియో డ్రాగి: 60% ఫ్యూమియో కిషిడా: 48% ఓలాఫ్ స్కోల్జ్: 44% జో బిడెన్: 43% జస్టిన్ ట్రూడో: 43% స్కాట్ మోరిసన్: 41% పెడ్రో సాంచెజ్: 40% మూన్ జే-ఇన్: 38% జైర్ బోల్సోనారో: 37% ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: 34% బోరిస్ జాన్సన్: 26%

Also Read:

Amar Jawan Jyoti: 50 ఏళ్ల తర్వాత శాశ్వతంగా ఆరిపోనున్న అమర్ జవాన్ జ్యోతి.. ఎందుకో తెలుసా..?

Viral Video: వామ్మో.. పెళ్లి వేదికపైనే వరుడికి చుక్కలు చూపించిన వధువు.. వీడియో వైరల్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?