Mahesh Babu: మహేష్‌ను సేవ వైపు మళ్లించిది ఆ సంఘటనే.. బాలయ్య షోలో సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
AHA Unstoppable: మహేష్‌బాబు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదీకగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ప్రసారమవుతోన్నవిషయం తెలిసిందే. ఈ షోలో తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది...
AHA Unstoppable: మహేష్‌బాబు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదీకగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ప్రసారమవుతోన్నవిషయం తెలిసిందే. ఈ షోలో తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది. చివరి ఎపిసోడ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రోమోను విడుదల చేశారు.
ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ మొదలు కానున్న ఈ టాక్ షో ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇక తాజాగా విడుదలైన ప్రోమోను గమనిస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యానికి అవసరమయ్యే ఖర్చులను భరిస్తూ సేవ అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ సేవ కార్యక్రమాలను ప్రారంభించడానికి గల కారణాన్ని ఈ షోలో తెలిపారు. మహేష్ తనయుడు గౌతమ్ ఆరు వారాల ముందు జన్మించాడని, ఆ సమయంలో గౌతమ్ కేవలం అరచేతంత సైజ్‌లో ఉన్నాడని తెలిపారు మహేష్. అయితే తమ వద్ద డబ్బు ఉంది కాబట్టి మాకు సరిపోయింది.. కానీ చాలా మందికి ఆ అవకాశం ఉండదు, కాబట్టి వారికి సేవ చేయాలనుకొని అప్పటి నుంచి ఈ మార్గంలో అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు మహేష్.
ఇలా తొలిసారి మహేష్ ఎమోషన్‌కు గురయ్యారు. ఇక ప్రోమో ప్రారంభంలో బాలకృష్ణ అడిగిన.. అసలు మహేష్ ఎవరు.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను మా పిల్లలకు తండ్రిని అని చెప్పిన సమాధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా హైదరాబాద్ కేబీఆర్ పార్కులో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా పంచుకున్నారు మహేష్. పార్కులో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో పాము కనిపించడంతో మరోసారి అటువైపు వెళ్లలేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు ప్రిన్స్. అన్‌స్టాపబుల్ తొలి సీజన్ చివరి ఎపిసోడ్ ఇలా ఫన్నీ ఫన్నీగా సాగింది. మరి ఈ కొత్త ప్రోమోపై మీరు ఓ లుక్కేయండి..
Also Read: IND vs SA, 2nd ODI: విరాట్ కోహ్లీ కెరీర్‌లో అరుదైన ఘనత.. ఈ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?
Twitter Video Download: మీ స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోండిలా..!