Viral Video: షోరూమ్ అద్దాల‌ను బ‌ద్ద‌లు కొట్టుకొచ్చిన మ‌హీంద్ర థార్ కొత్త‌ కారు.. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియో..

Viral Video: కొత్త కారు కొన్న ఆనందం కొన్ని క్ష‌ణాలు కూడా లేక పోతే ఎలా ఉంటుంది.? ల‌క్షల రూపాయ‌లు పెట్టి కొన్ని కారు క‌నీసం రోడ్డుపైకి కూడా రాక‌ముందే డ్యామేజ్ అయితే ఆ బాధ‌ను భ‌రించ‌డం ఎంతో క‌ష్టంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే...

Viral Video: షోరూమ్ అద్దాల‌ను బ‌ద్ద‌లు కొట్టుకొచ్చిన మ‌హీంద్ర థార్ కొత్త‌ కారు.. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియో..
Thar Car Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 21, 2022 | 5:43 PM

Viral Video: కొత్త కారు కొన్న ఆనందం కొన్ని క్ష‌ణాలు కూడా లేక పోతే ఎలా ఉంటుంది.? ల‌క్షల రూపాయ‌లు పెట్టి కొన్ని కారు క‌నీసం రోడ్డుపైకి కూడా రాక‌ముందే డ్యామేజ్ అయితే ఆ బాధ‌ను భ‌రించ‌డం ఎంతో క‌ష్టంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే బెంగ‌ళూరులో జ‌రిగింది. బెంగ‌ళూరులోని మ‌హీంద్ర షోరూమ్‌లో ఓ క‌స్ట‌మ‌ర్ థార్ కారును కొనుగోలు చేశాడు. డెలివ‌రీ రోజున కారును టెస్ట్ డ్రైవ్ చేయాల‌ని కారు ఇంజ‌న్ స్టార్ట్ చేశాడు. అంత‌కు ముందు కారు న‌డిపిన అనుభం లేదా.. కారులో ఏమైనా ప్రాబ్ల‌మ్ ఉందో తెలియ‌దు కానీ. కారు ఒక్క‌సారిగా దూసుకెళ్లింది.

ఏకంగా షోరూమ్ అద్దాల‌ను బ‌ద్ద‌లు కొట్టుకొని షోరూమ్ బాల్క‌నీలోకి వెళ్లింది. షోరూమ్ ముందు భాగంలోని రెయిలింగ్స్‌ను ఢీకొట్టింది. అయితే ఇందులో సంతోషాల్సిన ఆంశం ఒక్క‌టే.. కారు అక్క‌డితోనే ఆగిపోవ‌డం. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన షోరూమ్ స‌భ్యులు వెంట‌నే కారును ఎలాగోలా తిరిగి షోరూమ్ లోప‌లికి పంపించారు. దీంతో అక్క‌డున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. హైద‌రాబాద్ ఎల్‌బీ న‌గ‌ర్‌లోని టాటా షోరూమ్‌లో ఇలాగే ఓ కొత్త కారు షోరూమ్ మొద‌టి అంత‌స్తు నుంచి ఏకంగా బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌ట్లో ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా గ‌తంలో ఓసారి కియా కారు ఇలాగే షోర్ నుంచి బ‌య‌ట‌కు రాగానే గోడ‌ను ఢీకొట్టిన విష‌యం తెలిసిందే.

Also Read: Fixed Deposite: ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

Twitter Video Download: మీ స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

Zero Bedroom House: ఒక్క బెడ్ రూమ్ కూడా లేని చిన్న చెక్క ఇల్లు.. కోట్లు ఖరీదు.. ఎక్కడంటే..