Fixed Deposite: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
ఎలాంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన ఆదాయం రావడానికి మంచి పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలికంగా ఉంటాయి...
ఎలాంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన ఆదాయం రావడానికి మంచి పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలికంగా ఉంటాయి. రకాన్ని బట్టి వడ్డీ రేటు ఉంటుంది. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఎఫ్‌డీ వడ్డీ రేటు కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలవ్యవధితో కూడిన ఎఫ్‌డీలకు తక్కువ వడ్డీ రేటు ఉండగా.. ఎక్కువ కాలవ్యవధితో కూడిన ఎఫ్‌డీలకు ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలు చేసే 1 నుంచి 2 సంవత్సరాల్లోపు డిపాజిట్లకు 5 శాతం వడ్డీ అందిస్తుంది. 3 నుంచి 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.30 శాతం, 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 5.40 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
కొన్ని బ్యాంకులు 5-10 ఏళ్ల కాలపరిమితితో కూడిన ఎఫ్‌డీల కంటే.. 5 ఏళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 3 ఏళ్లపైన 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ ఇస్తుంటే, 5 ఏళ్ల పైన, 10 సంవత్సరాల్లోపు డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ ఇస్తోంది. బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలకు వివిధ కాలవ్యవధితో 2.25 శాతం నుంచి 6.50 శాతం వడ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. అయితే, వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. క్యుములేటివ్, నాన్-క్యుములేటివ్. క్యుములేటివ్ మోడ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం మెచ్యూరిటీ వరకు లాక్ చేసి ఉంచుతారు. వడ్డీ, అసలు కలిపి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. నాన్-క్యుములేటివ్ మోడ్‌లో ప్రతి నెలా, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా స్థిర వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.
డబ్బు అత్యవసరం అయినప్పుడు సాధారణంగా రుణం కోసం దరఖాస్తు చేస్తారు. అయితే ఎఫ్‌డీ ఖాతా ఉన్నవారు ఆటోమేటిక్‌గా రుణ అర్హతను పొందుతారు. తాము డిపాజిట్ చేసిన ఎఫ్‌డీ నుంచి 75 శాతం వరకు రుణం పొందొచ్చు. అయితే బ్యాంకులు మీకు చెల్లించే వడ్డీ కంటే 2 శాతం అదనపు వడ్డీని రుణం కోసం మీ నుంచి తీసుకుంటాయి.
Read Also..Home Loan: హోం లోన్ తీసుకుని వాయిదాలు చెల్లించలేకపోతున్నారా..