AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance policies: ఆ బీమా పాలసీతో ఎన్ఆర్ఐలకు భలే బెనిఫిట్స్.. లాభం వచ్చేది ఎంతంటే?

ప్రతి ఒక్కరికీ బీమా అనేది ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతుంది. అనారోగ్యం పాలైనప్పడు ఆస్పత్రి ఖర్చులను భరిస్తుంది. కాబట్టి ఆరోగ్య, టర్మ్ బీమాలను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో 30 ఏళ్లకే రోగాలు దాడి చేస్తున్నాయి. వాటి చికిత్సల కోసం ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. కాబట్టి ఆరోగ్య బీమా అనేది అందరికీ అత్యవసరంగా మారింది. మరి మన దేశం వెలువల నివసించే ఎన్ఆర్ఐల మాటేమిటి. వారికి ఇక్కడి బీమా పాలసీలు వర్తిస్తాయా, ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Insurance policies: ఆ బీమా పాలసీతో ఎన్ఆర్ఐలకు భలే బెనిఫిట్స్.. లాభం వచ్చేది ఎంతంటే?
Insurance Policies
Nikhil
|

Updated on: Apr 10, 2025 | 4:45 PM

Share

భారతదేశం వెలువల నివసించే ఎన్ఆర్ఐలకు ఇక్కడి ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బీమా ప్రీమియాలపై జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు. స్వదేశానికి వచ్చినప్పుడు వారికి, కుటుంబ సభ్యులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భరోసాను అందిస్తాయి. ప్రపంచంలోని మిగిలిన దేశలతో పోల్చితే మన పాలసీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ కవరేజీని అందజేస్తాయి. భారతీయ బీమా పథకాలను కొనుగోలు చేయడం కోసం ఎన్ఆర్ఐలకు ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపులు అందిస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు కోసం ఈ కింది నిబంధనలు వర్తిస్తాయి.

  • పాలసీని ప్రతిపాదించే వ్యక్తి తప్పనిసరిగా ఎన్ఆర్ఐ అయ్యి ఉండాలి. పాలసీ కింద బీమా కూడా చేయించుకోవాలి. అంటే దేశంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు పాలసీలను కొనుగోలు చేయవచ్చు.
  • బీమా ప్ప్రీమియం చెల్లింపులు నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ (ఎన్ఆర్ఎఫ్) ఖాతా నుంచి చెల్లించాలి. అప్పుడు మాత్రమే జీఎస్టీ వాపసుకు అర్హత లభిస్తుంది.
  • బీమా ప్రీమియాలను ఏటా చెల్లించాలి. నెలవారీ, త్రైమాసిక చెల్లింపులు జరిపితే మినహాయింపు లభించదు.
  • ఎన్ఆర్ఐలు తమ కేవైసీ పత్రాలను సమర్పించాలి.
  • పాన్ కార్డు, భారతీయ, అంతర్జాతీయ చిరునామా, ఎన్ఆర్ఈ బ్యాంక్ ఖాతా స్టేట్ మెంట్, పాస్ పోర్టు, ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంప్ తో కూడిన వీసాను బీమా సంస్థలు అడగుతాయి.
  • పాలసీ జారీ చేసిన తర్వాత జీఎస్ టీ వాపసు ప్రక్రియకు సుమారు 15 రోజులు పడుతుంది.

జీవిత బీమా పాలసీలపై పన్ను ప్రయోజనాలు కూడా ఎన్ఆర్ఐలు పొందవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తో జీవిత బీమా పాలసీ తీసుకున్నవారికి పాత పన్ను విధానంలో మినహాయింపు లభిస్తుంది. దాని కింద ప్రీమియాలకు తగ్గింపులను క్లయిమ్ చేసుకోవచ్చు. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ అవకాశం ఉంటుంది. పన్ను ఆదా కావడంతో బీమాను తగ్గింపు పొందవచ్చు. ఆరోగ్య బీమా పాలసీల విషయానికి వస్తే మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులను కవర్ చేసే పాలసీ ప్రీమియాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డి కింద మినహాయింపు లభిస్తుంది.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..