Home Loan: హోం లోన్ తీసుకుని వాయిదాలు చెల్లించలేకపోతున్నారా..

సొంత ఇల్లు ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ సొంత ఇల్లు కట్టుకోవడం చిన్న విషయం ఏమి కాదు. చాలా వరకు డబ్బు అవసరం వస్తుంది....

Home Loan: హోం లోన్ తీసుకుని వాయిదాలు చెల్లించలేకపోతున్నారా..
Home Loan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 21, 2022 | 2:48 PM

సొంత ఇల్లు ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ సొంత ఇల్లు కట్టుకోవడం చిన్న విషయం ఏమి కాదు. చాలా వరకు డబ్బు అవసరం వస్తుంది. అందుకే ఇల్లు కట్టుకోవాలనుకున్న మధ్య తరగతి వ్యక్తులు బ్యాంకు లోన్స్ తీసుకుంటారు. తక్కువ వడ్డీ లోన్ రావడంతో ఎక్కువ మంది గృహరుణాలు తీసుకుంటున్నారు. లోన్ తీసుకున్న తర్వాత వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే రుణగ్రహీతకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యం.

మొండి బాకీగా.. వరుసగా మూడు నెలలపాటు హోం లోన్ వాయిదాలను చెల్లించకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆ బాకీని తాత్కాలిక డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి. రుణగ్రహీతకు నోటీసులు పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే.. మరో మూడు నెలల తర్వాత రుణ వసూలుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. ఇంటి వేలానికి నోటీసులు ఇవ్వడం వరకు వెళ్తే అవకాశం ఉంటుంది.

వాయిదాలు ఆలస్యమైనప్పుడు బ్యాంకులు వాయిదా మొత్తానికి 1 నుంచి 2 శాతం వరకు ఫైన్ విధిస్తాయి. మేజర్‌ డిఫాల్ట్‌గా మారితే.. ఆ రుణాన్ని మొండి బాకీగా (ఎన్‌పీఏ) నిర్ణయిస్తాయి. కొన్ని సంస్థలు రుణ వసూలుకు థర్డ్‌ పార్టీ సేవలను వినియోగించుకుంటాయి. వాయిదాలను సరిగా చెల్లించకపోతే.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తరచూ ఈఎంఐలు బ్యాంకులో జమ కాకపోతే క్రెడిట్‌ స్కోరు కనీస స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానం చేశాయి. దీంతోపాటు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తున్నాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు పెరిగే ఛాన్స్ ఉంది.

వాయిదాలను చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు తెలిసిన మిత్రులు, బంధువుల దగ్గర చేబదులు తీసుకోవచ్చు. మీకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా పాలసీలు ఉంటే వాటిపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పరిస్థితులు సర్దుకున్నాక ఎవరి డబ్బులు వారికి చెల్లించాలి.

Read Also.. Post office RD: పోస్టాఫీసులో కూడా RD ఖాతాను తెరవవచ్చు.. వడ్డీ రేటు, ఇతర వివరాలు..