K-Dramas: ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త ప్లాన్.. ఈ ఏడాది 25 కొరియన్ షోలు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన..

K-Dramas: ప్రముఖ ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా సరికొత్త థీం తో కొత్త ఏడాదిలో రానుంది. 2022లో 25 కంటే ఎక్కువగా కొరియన్ షో (Korean Show)లను రిలీజ్..

K-Dramas: ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త ప్లాన్.. ఈ ఏడాది 25 కొరియన్ షోలు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన..
New K Dramas Declared By Netflix
Follow us
Surya Kala

|

Updated on: Jan 21, 2022 | 1:48 PM

K-Dramas: ప్రముఖ ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా సరికొత్త థీం తో కొత్త ఏడాదిలో రానుంది. 2022లో 25 కంటే ఎక్కువగా కొరియన్ షో (Korean Show)లను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక ఏడాదిలో కొరియన్ షోలను రిలీజ్ చేయడం ఇదే భారీ సంఖ్య. “స్క్విడ్ గేమ్”, “హెల్‌బౌండ్” , “విన్సెంజో” వంటి K-డ్రామాలు రికార్డ్ స్థాయిలో జనాదరణ సొంతం చేసుకున్నాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఏడాదిలో కొరియన్ డ్రామాలు, షో లు రిలీజ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఒటిటి ప్లాట్‌ఫారమ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వత కొరియన్ షోలు జనాదరణ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 2021లో అత్యంత గ్లోబల్ ఆదరణ పొందిన సీరియస్స్ గా నిలిచి కొరియన్ సీరియల్స్ ఆధిపత్యం చెలాయించాయి. ముఖ్యంగా “స్క్విడ్ గేమ్” భారీ ఆదరణ సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది. సుమారు 94 దేశాల్లో అత్యధిక మంది చూసిన షోగా రికార్డ్ ను సొంతం చేసుకుంది.

“స్క్విడ్ గేమ్” ను చూసిన ప్రేక్షకులల్లో 95 శాతం మంది కొరియా నుంచి కాకుండా ఇతర దేశాలవారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో K-కంటెంట్‌ను వేదికేవారి సంఖ్య మరింత అధికమయింది. 2019తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో కొరియన్ షోలను చూసేవారి సంఖ్య వారి గత ఏడాది ఆరు రెట్లు పెరిగిందని స్టీమర్ చెప్పారు.

రోజు రోజుకీ కొరియన్ డ్రామాలు గ్లోబల్ ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. 2016 నుండి 2021 వరకు.. నేటిప్లిక్స్ లో 130 కంటే ఎక్కువ కొరియన్ డ్రామాలు షోలు ఉన్నాయి. దీని వలన Netflix మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. కొరియన్ కంటెంట్.. వైవిధ్యమైన, కథలు కథనానికి నిలయం అని తెలుసు.

కొరియన్ డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు ఎక్కువగా కలిగి ఉన్నందున.. K-వేవ్‌ను కొత్త శిఖరాలకు తీసుకుని వెళ్లేందుకు ఇప్పుడు 2022 లో మొత్తం 25 విభిన్న కొరియన్ డ్రామాలను రిలీజ్ చేయనున్నామని నెట్ ప్లిక్స్ అధినేత చెప్పారు.

జాంబీస్ హైస్కూల్‌ నేపధ్య డ్రామా “మనీ హీస్ట్” “సియోల్ వైబ్” యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్స్, 1988 సియోల్ ఒలింపిక్ గేమ్‌ల నేపథ్యంలో సాగే డ్రామాలు ఇప్పటికే ప్రజాదరణను సొంతం చెసుకున్నాయి. తాజాగా కొరియా కొత్త డ్రామా కధనాలతో ప్రసిద్ధ దక్షిణ కొరియా నటులను తిరిగి పరిచయం చేస్తుంది. సస్పెన్స్ , రొమాంటిక్ డ్రామాలతో పాటు కొరియా వాతావరణంలో పనిచేసే వ్యక్తుల జీవితం, ప్రేమ కథల చుట్టూ తిరగే స్తోరీలను ఫాంటసీ డ్రామాలతో నెట్ ప్లిక్స్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..