IND vs SA, 2nd ODI: విరాట్ కోహ్లీ కెరీర్‌లో అరుదైన ఘనత.. ఈ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?

Virat Kohli: బోలాండ్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఈ వన్డేలో టీమిండియా తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది.

IND vs SA, 2nd ODI: విరాట్ కోహ్లీ కెరీర్‌లో అరుదైన ఘనత.. ఈ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jan 21, 2022 | 6:38 PM

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా(India vs South Africa) మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే కోహ్లీ పేరు మీద ఒక రికార్డు నమోదైంది. ఇలాంటి రికార్డు కేవలం కొద్దిమంది భారతీయ ఆటగాళ్ల పేరిట మాత్రమే నమోదైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 450వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..

450వ అంతర్జాతీయ మ్యాచ్.. భారత్ నుంచి 450వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన నాలుగో ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు. అతని కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట నమోదైంది. కోహ్లి క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రాణిస్తూ పరుగులు రాబట్టాడు. పరుగుల పరంగా ఎందరో దిగ్గజాలను వెనక్కునెట్టాడు. ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడతాడని భావించినా.. అది కుదరకపోవడంతో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

వన్డే కెరీర్.. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 256 వన్డేలు ఆడాడు. ఇందులో అతను 12, 220 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు.

టీ20 కెరీర్.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 95 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇందులో అతని బ్యాటింగ్‌లో 3227 పరుగులు వచ్చాయి. క్రికెట్‌లో అత్యంత పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ 29 అర్ధశతకాలు సాధించాడు. కానీ, ఇప్పటి వరకు టీ20లో సెంచరీ చేయలేకపోయాడు.

టెస్టు కెరీర్.. ఓపెనర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడాడు. అతని బ్యాట్ 168 ఇన్నింగ్స్‌లలో 7962 పరుగులు సాధించింది. ఈ ఫార్మాట్‌లో కోహ్లి 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు సాధించాడు. సుమారు 7 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న తర్వాత ఈ పదవిని వదులుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన పంత్.. డిఫరెంట్ డ్యాన్స్‌తో విష్ చేసిన కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..!

India cricket team: కోహ్లీకే కాదు.. టీమ్ ఇండియాకు కూడా గడ్డుకాలం.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్

రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
మీ వాట్సాప్‌కు ఇలాంటి మెసేజ్‌ వచ్చిందా? ఓపెన్ చేస్తే అకౌంట్ ఖాళీ
మీ వాట్సాప్‌కు ఇలాంటి మెసేజ్‌ వచ్చిందా? ఓపెన్ చేస్తే అకౌంట్ ఖాళీ
మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. గుర్తు పట్టారా?
మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. గుర్తు పట్టారా?
డబ్బులకు ఇబ్బందా.. నెమలి ఈకను ఇంట్లో ఈ దిశలో పెట్టి చూడండి
డబ్బులకు ఇబ్బందా.. నెమలి ఈకను ఇంట్లో ఈ దిశలో పెట్టి చూడండి
తామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా..? లాభాలు తెలిస్తే
తామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా..? లాభాలు తెలిస్తే
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఈ స్కోర్ బాగుంటే క్షణాల్లో బ్యాంకు రుణం..!
ఈ స్కోర్ బాగుంటే క్షణాల్లో బ్యాంకు రుణం..!
ఇంట్లో కూరగాయలు పండించుకొండిలా టెర్రస్ గార్డెన్ పై ఫ్రీ ట్రైనింగ్
ఇంట్లో కూరగాయలు పండించుకొండిలా టెర్రస్ గార్డెన్ పై ఫ్రీ ట్రైనింగ్
వయనాడ్‌లో గాంధీ ఫ్యామిలీకే మరోసారి పట్టం..!
వయనాడ్‌లో గాంధీ ఫ్యామిలీకే మరోసారి పట్టం..!
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు