Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన పంత్.. డిఫరెంట్ డ్యాన్స్‌తో విష్ చేసిన కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..!

రిషబ్ పంత్, తన మార్క్ దూకుడైన బ్యాటింగ్‌తో బౌండరీలు, సిక్సులతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ సిక్స్ కొట్టాడు. అలాంటి సిక్స్‌ను చూసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ షేకింగ్ డ్యాన్స్ చేస్తూ పంత్‌కు విషెస్ తెలిపాడు.

Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన పంత్.. డిఫరెంట్ డ్యాన్స్‌తో విష్ చేసిన కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..!
Ind Vs Sa Virat Kohli Viral Dance
Follow us
Venkata Chari

|

Updated on: Jan 21, 2022 | 5:17 PM

IND vs SA: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా(India vs South Africa) టీంల మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో ఓడిపోయిన భారత్.. ఈ మ్యాచులో కచ్చితంగా గెలవాల్సిన సరిస్థితి నెలకొంది. రెండు వికెట్లు కోల్పోయిన తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(Rishabh Pant), తన మార్క్ దూకుడైన బ్యాటింగ్‌తో బౌండరీలు, సిక్సులతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ సిక్స్ కొట్టాడు. అలాంటి సిక్స్‌ను చూసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli)షేకింగ్ డ్యాన్స్ చేస్తూ పంత్‌కు విషెస్ తెలిపాడు.

టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ధావన్, కేఎల్ రాహుల్ కీలకమైన 63 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తరువాత వెంటవెంటనే వరుసగా ధావన్(29), విరాట్ కోహ్లీ(0) వికెట్లు పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తన దూకుడుతో బౌండరీల వర్షం కురిపించాడు. అయితే ఇన్నింగ్స్‌27.6 ఓవర్లో షంమ్సీ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదుతూ కనిపించిన పంత్.. ఐదో బాల్‌ను ఫోర్ బాది, ఆరో బంతిని ఒంటి చేత్తో భారీ సిక్స్‌ బాదేశాడు. దీంతో దక్షిణాఫ్రికా బౌలర్లతోపాటు టీమిండియా ప్లేయర్లు కూడా షాకయ్యారు. ఇక విరాట్ కోహ్లీ మాత్రం తనదైన స్టైల్‌లో షేకింగ్ డ్యాన్స్ చేస్తూ పంత్‌కు విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

మ్యాచ్ విషయానికి వస్తే, 34 ఓవర్లకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ధావన్ 29, విరాట్ కోహ్లీ 0, కేఎల్ రాహుల్ 55, రిషబ్ పంత్ 85పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

Also Read: India cricket team: కోహ్లీకే కాదు.. టీమ్ ఇండియాకు కూడా గడ్డుకాలం.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్

Axar Patel: టీమిండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..