India cricket team: కోహ్లీకే కాదు.. టీమ్ ఇండియాకు కూడా గడ్డుకాలం.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్

మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లికి బీసీసీఐ పొగబెడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ కయ్యం సౌతాఫ్రికా టూర్‌తో మొదలుకాలేదు. దీనికి బీజం 2017 నుంచే పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

India cricket team: కోహ్లీకే కాదు.. టీమ్ ఇండియాకు కూడా గడ్డుకాలం.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్
Virat Kohli
Follow us

|

Updated on: Jan 21, 2022 | 4:33 PM

Virat Kohli:  టీమిండియాలో కింగ్‌ కోహ్లి శకం ముగిసినట్టేనా? కెప్టెన్‌గా తప్పుకోవడం విరాట్‌ వంతు.. ప్లేయర్‌గా పక్కన పెట్టడం మా వంతు అంటూ బీసీసీఐ పావులు కదుపుతోందా? మరోవైపు నోటీసులిచ్చేందుకు దాదా అండ్‌ కో రెడీ అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. యస్‌.. అన్నీ ఊహించినట్టు జరిగితే.. నెక్స్‌ విండీస్‌ టూర్‌లో కోహ్లిని సెలెక్ట్ చేయడం అనుమానమే. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లికి బీసీసీఐ ఎందుకు పొగబెడుతుంది. ఈ కయ్యం సౌతాఫ్రికా టూర్‌తో మొదలుకాలేదు. దీనికి బీజం 2017 నుంచే పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోనీ. అయినప్పటికీ మహీకి సాధ్యం కాని విజయాలు, రికార్డుల్ని నమోదు చేసింది విరాట్ కోహ్లినే. అలాంటి ది బెస్ట్ కెప్టెన్‌.. ఇప్పుడు టీమ్‌లో ప్లేయర్‌గా ఉంటాడా అన్న స్థాయికి దిగజారిపోయింది సిట్యువేషన్.

ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచినా ప్రత్యర్థి జట్లను భయపెట్టింది లేదు. కానీ కోహ్లి కెప్టెన్సీలో మన టీమ్‌ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. కారణం.. కోహ్లి అగ్రెసివ్ నేచర్. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ టీమ్‌ను వణికించినా.. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ ప్రేక్షకుల మధ్య ఆ జట్టును భయపెట్టగలిగినా అది కోహ్లీ దూకుడు మంత్రమే. సేనా కంట్రీస్‌పై గెలిచిన మొదటి ఆసియా కెప్టెన్‌ కూడా. చివరకు అదే దుందుడుకుతనం కోహ్లీకి చేటు తెచ్చిపెట్టిందనే ప్రచారం నడుస్తోంది.

2016లో టీమిండియాకు కోచ్‌గా వచ్చాడు కుంబ్లే. కానీ కోహ్లికి అది నచ్చలేదు. ఇద్దరి మధ్య విభేదాలు 2017లో పీక్‌కి వెళ్లాయి. ఎంతలా అంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాక్‌ చేతిలో ఓడిపోయేంతలా. ఎలాగోలా కుంబ్లేను కోచ్‌ పదవి నుంచి తప్పుకునేలా కోహ్లి సక్సెస్ అయ్యాడు. కానీ అక్కడే గంగూలీకి చిర్రెత్తుకొచ్చింది. శాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం టీమ్‌ మొత్తాన్ని కోహ్లి తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడనే ప్రచారం ఉంది. ఎప్పుడైతే కోచ్‌గా శాస్త్రి దిగిపోయాడో అప్పుడు ఒంటరి పక్షి అయిపోయాడు కోహ్లి.

టీ20 వరల్డ్‌ కప్‌లో ప్రభావం చూపకపోవడం.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఫ్లాప్‌ షో.. రెండేళ్లుగా సెంచరీ లేకపోవడం.. ఇలా వరుస పరిణామాలు కోహ్లి కార్నర్ అయ్యేలా చేశాయి. తన అగ్రెసివ్‌, దూకుడుమంత్రం తనకే చేటు తెచ్చింది. లెటెస్ట్‌గా బీసీసీఐ కోహ్లికి షోకాజ్ నోటీసులిస్తుందనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే.. విండిస్‌ టూర్‌కి కోహ్లి ఎంపిక అనుమానమే. ఆ తర్వాత ఆటగాడిగా కొనసాగడం కూడా డౌటే. మొత్తానికి ఎంత ఫాస్ట్‌గా ఎదిగాడో అంతే ఫాస్ట్‌గా కిందపడ్డాడు కింగ్ కోహ్లి.

ఓ వైపు కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌బై… మరోవైపు టీమిండియా వరుస ఓటములు.. సగటు అభిమానిని అసహనానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రభావం ఐసీసీ ప్రకటించే టీమ్‌పైనా పడింది. 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడి పేరు కూడా లేకుండాపోయింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది టీమిండియా. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

ఐసీసీ టీ20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌లో ఏకంగా ముగ్గురు పాక్‌ ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆ ముగ్గురిలో ఒకడైన బాబర్‌ ఆజమ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకుంది. బాబర్‌ ఆజమ్‌తో పాటు గతేడాది టీ20ల్లో రాణించిన పాక్‌ వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌, పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదిలు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫైనల్‌గా మన వాళ్లెవరూ ఐసీసీ ప్రకటించిన టీమ్‌లో లేకపోవడం మనకు అవమానకరమే. రీజన్ ఏదైనా టీమిండియా పరువు ప్రతిష్ట దిగజారడం అభిమానుల్ని ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Also Read: టీమిండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..