AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Axar Patel: టీమిండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన పుట్టినరోజు నాడు స్నేహితురాలు మేహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు అక్షర్...

Axar Patel: టీమిండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..
Axer1
Srinivas Chekkilla
|

Updated on: Jan 21, 2022 | 2:17 PM

Share

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన పుట్టినరోజు నాడు స్నేహితురాలు మేహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు అక్షర్. నిశ్చితార్థానికి సంబంధంచిన ఫొటోలను అక్షర్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఇది జీవితంలో కొత్త ప్రారంభం, మేము ఎప్పటికీ కలిసి ఉన్నాము. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను.” అంటూ ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

అక్షర్ పటేల్ తన 28వ పుట్టినరోజు వేడుకను జనవరి 20న జరుపుకున్నాడు. అదే రోజు స్నేహితురాలు మేహాకు నిశ్చితార్థపు ఉంగరాన్ని తోడిగాడు. అక్షర్, మేహా కుటుంబ సభ్యులతో పాటు, కొంతమంది సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు.

దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా వెళ్లలేకపోవడానికి ఇదే కారణం. గాయం కారణంగా అతను శ్రీలంకతో స్వదేశంలో జరిగే సిరీస్‌లో కూడా ఆడే అవకాశం తక్కువ. అక్షర్ గత సంవత్సరం ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసి 3 టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత, నవంబర్-డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు.

Read Also.. Legends League: సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాజీ ఆటగాడు.. 40 బంతుల్లో 80 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్..