Legends League: సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాజీ ఆటగాడు.. 40 బంతుల్లో 80 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్..

మస్కట్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇండియా మహారాజా 6 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్‌పై విజయం సాధించింది.

Legends League: సంచలన ఇన్నింగ్స్ ఆడిన మాజీ ఆటగాడు.. 40 బంతుల్లో 80 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్..
yusuf patan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 21, 2022 | 9:46 AM

మస్కట్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇండియా మహారాజా 6 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాంటింగ్ చేసిన ఇండియా మహారాజా 176 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. 40 బంతుల్లోనే 80 పరుగులు చేసి యూసుఫ్ పఠాన్ మ్యాచ్‌ని పూర్తిగా మలుపు తిప్పాడు. యూసుఫ్ పఠాన్ కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. యూసుఫ్‌తో పాటు కెప్టెన్ మహ్మద్ కైఫ్ 37 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

ఆసియా లయన్స్ తరఫున ఉపుల్ తరంగ 66, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ 44 పరుగులు చేశారు. ఇండియా మహారాజా తరఫున మన్‌ప్రీత్ గోని 3, ఇర్ఫాన్ పఠాన్ 2 వికెట్లు తీశారు. ఆసియా లయన్స్ తరఫున షోయబ్ అక్తర్, ఉమర్ గుల్ 1-1 వికెట్లు తీశారు. 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా మహారాజాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలిగింది. మూడో ఓవర్‌లో ఓపెనర్ స్టువర్ట్ బిన్నీ అవుటయ్యాడు. రెండో బంతికే ఎస్ బద్రీనాథ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వికెట్ కీపర్ నమన్ ఓజా కూడా 19 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకానొక సమయంలో ఇండియా మహారాజా స్కోరు 6.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ అద్భుత సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

యూసుఫ్ పఠాన్ తొలి బంతి నుంచే ఆసియా లయన్స్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. మరోవైపు మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్ట్రైక్ మార్చుతూ కనిపించాడు. యూసుఫ్ పఠాన్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో అవగాహన లోపంతో రనౌట్ అయ్యాడు. చివర్లో, అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి 5 బంతులు మిగిలి ఉండగానే ఇండియా మహారాజాతో విజయాన్ని అందించాడు. అంతకుముందు ఆసియా లయన్స్ తరఫున ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉపుల్ తరంగ 46 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తరంగ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో మిస్బా ఉల్ హక్ 30 బంతుల్లో ధీటుగా బ్యాటింగ్ చేశాడు. మిస్బా తన ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు కొట్టాడు.

Read Also.. T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ