Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..
తమిళ్ స్టార్ హీరో వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. తన నటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో

తమిళ్ స్టార్ హీరో వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. తన నటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది వరలక్ష్మి. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ వరలక్ష్మీకి పాపులారిటీ ఎక్కువగానే ఉంది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది వరలక్ష్మీ.
సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేస్తోన్న ప్రతీ అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.