Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar 2022: ఆస్కార్ బరిలో రెండు సౌత్ ఇండియన్ చిత్రాలు.. పోటా పోటీగా ఆ స్టార్ హీరోస్..

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డు ఆస్కార్ (Oscar). ఈ ఏడాది 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సౌత్ ఇండస్ట్రీ

Oscar 2022: ఆస్కార్ బరిలో రెండు సౌత్ ఇండియన్ చిత్రాలు.. పోటా పోటీగా ఆ స్టార్ హీరోస్..
Jaibhim
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 22, 2022 | 6:54 AM

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డు ఆస్కార్ (Oscar). ఈ ఏడాది 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సౌత్ ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు ఎంపికయ్యాయి. అవి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జైభీమ్ (Jaibhim) సినిమా కాగా.. మరొకటి మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన మరక్కార్ (Marakkar) సినిమాలు నామినేట్ అయ్యాయి. ఇందులో మొత్తం 276 చిత్రాల జాబితాను వెల్లడించగా… అందులో జైభీమ్, మరక్కార్ సినిమాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.

గతేడాది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ సినిమా ప్రశంసలు అందుకుంది. జస్టిస్ చంద్రు నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం చేయబడిన తమిళ సినిమాగా గౌరవం దక్కించుకుంది. గిరిజనుల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవలే ఈ సినిమా నోయిడా ఫిల్మ్ ఫేర్ పెస్టివల్‍కు ఎంపికయ్యింది.

ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఆయా కేటగిరిలకు చెందిన ఫైనల్ నామినేషన్స్ ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి 27న అమెరికాలో జరగనుంది.

Also Read: Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..