Coronavirus: కరోనా బారిన పడిన టాలీవుడ్ డైరెక్టర్.. వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలంటూ పోస్ట్..
సినిమా ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. పలువురు ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. పలువురు ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ హలో ఫ్రెండ్స్ నాకు కొవిడ్ వచ్చింది… ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఆ కరోనాను అందరూ సీరియస్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వేదికగా సూచించాడు తరుణ్ భాస్కర్.
కాగా విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ వరుసగా రెండో హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీతో ఈ డైరెక్టర్ హీరోగా కూడా మెప్పించాడు. ఈ సినిమాను టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నిర్మించాడు. కాగా ప్రస్తుతం అతను ఒకే ఒక జీవితం, ఓ మై కడవులే రీమేక్ కు సంభాషణలు అందిస్తున్నాడు. వీటితో పాటు హీరో వెంకటేష్‌తో ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
Also Read:
IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..