Virgin Story: వర్జిన్ స్టోరి నుంచి మరో లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న కొత్తగా రెక్కలొచ్చెనా..

ప్రముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం,

Virgin Story: వర్జిన్ స్టోరి నుంచి మరో లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న కొత్తగా రెక్కలొచ్చెనా..
Vikram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 22, 2022 | 8:36 AM

ప్రముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు అతని పర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ యంగ్ టాలెంట్ వర్జిన్ స్టోరి చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విక్రమ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటిస్తున్నారు.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..