RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

RRR: క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే సినిమా రిలీజ్‌కు సంబంధించిన తాజాగా బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న..

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..
Rrr Movie
Follow us

|

Updated on: Jan 21, 2022 | 6:59 PM

RRR: గ‌డిచిన సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంద‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్‌ల‌ను నిర్వ‌హించ‌డం, కొన్ని చోట్ల ప్రీ బుకింగ్ కూడా చేయ‌డంతో ఇక సినిమా విడుద‌ల కాన్ఫామ్‌ అని ఫ్యాన్స్ సంతోషించారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రాజ‌మౌళి తెర‌క్కించిన అద్భుత దృశ్య‌కావ్యాన్ని వెండితెర‌పై చూద్దామ‌నుకున్న వారి ఆశ‌ల‌పై క‌రోనా నీళ్ల‌ను చ‌ల్లింది. దేశంలో కేసులు భారీగా పెర‌గ‌డం, ప‌లు రాష్ట్రాలు నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమాను వాయిదా వేయ‌లేక త‌ప్ప‌లేదు.

దీంతో సినిమా విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌దుప‌రి తేదీని ప్ర‌క‌టించ‌కుండా ప్రేక్ష‌కుల‌ను డైలమాలో పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా నిరాశ‌కు గుర‌య్యారు. అప్ప‌టి నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా.? అని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూశారు. దీంతో అభిమానుల వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ సినిమా తేదీని ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

ఒక‌వేళ దేశంలో క‌రోనా అదుపులోకి వ‌చ్చి ఫుల్ కెపాసిటీతో థియేట‌ర్లు ర‌న్ అయితే మార్చి 18, 2022న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని. కుద‌ర‌ని ప‌క్షంలో ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని ట్వీట్ చేశారు. దీంతో ఇన్ని రోజులుగా సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కుమ్రం భీం పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Also Read: Stock Market: నాలుగు రోజుల్లో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

IIT Kharagpur: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర‌కుపైగా జీతం పొందే అవ‌కాశం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ