Viral Video: నదిలో సదరాగా గడిపేందుకు వెళ్లిన టూరిస్టులకు గుండె ఆగినంత పనైంది.. అంతలోనే

అమెరికాలోని... ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశం ఉంది. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తుంటారు. తాజాగా నేచర్ ను ఎంజాయ్ చేసేందుకు అక్కడకు వెళ్లినవారికి వింత అనుభవం ఎదురైంది.

Viral Video: నదిలో సదరాగా గడిపేందుకు వెళ్లిన టూరిస్టులకు గుండె ఆగినంత పనైంది.. అంతలోనే
Big Fish Spotted
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2022 | 5:23 PM

Huge Manatee Fish:  సోషల్‌ మీడియాలో ఓ భారీ వింత చేపకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. అమెరికాలోని… ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశం ఉంది. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తుంటారు. అదో నదీ పరీవాహక ప్రాంతం కావడంతో ..టూరిస్టులు అక్కడి ప్రకృతి అందాలను బాగా ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా కయాకింగ్ అంటే టూరిస్టులకు ఇష్టం. తాజాగా కొందరు టూరిస్టులు బోట్లలో దిగి.. నదిలో కయాకింగ్ చేయడం ప్రారంభించారు. ఇంతలో ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.

నదిలో నీరు స్వచ్ఛంగా ఉంది. టూరిస్టులు ఎంతో ఉత్సాహంగా అందులో కయాకింగ్‌ (బోటింగ్‌) చేస్తున్నారు. ఇంతలో ఆ నీటిలో ఓ భారీ చేప, దాని పిల్ల… నెమ్మదిగా ఈదుకుంటూ వచ్చాయి. అవి చూడ్డానికి వింతగా ఉన్నాయి. అవి బోట్ల కిందకు వస్తుండటంతో ఏంచేస్తాయోనని టూరిస్టులు చాలా భయపడిపోయారు. కానీ ఆ చేపలు ఏమీ చెయ్యలేదు. సైలెంట్ గా వెళ్లిపోయాయి. అప్పటివరకూ టెన్షన్ పడిన టూరిస్టులు… ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోని  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మనాటీ అనే ఈ చేపలు మనుషులకు ఎలాంటి హానీ చెయ్యవట. పైగా చూడ్డానికి భారీ సైజులో బొద్దుగా ఉంటాయి. వీటిని నీటి ఆవులుగా పిలుస్తారు. ఇవి ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి ఆహారంగా సముద్ర మొక్కల్ని తింటాయి. అంతేకాదు.. ఇవి ఇతర చేపలు, జీవులకు ఎలాంటి హానీ చేయవట. మనుషులు సముద్రాల్లో వదిలేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇవి ఎక్కువగా చనిపోతున్నాయి. భూమిపై ఆవులు ఎలాగైతే… తమకు తెలియకుండానే ప్లాస్టిక్ పదార్థాలు తినేస్తున్నాయో… అలాగే మనాటీలు కూడా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల్ని తినేస్తుండటంతో.. వాటి ప్రాణాలకు హాని కలిగిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ అరుదైన ప్రాణులు అంతరించిపోయే ప్రమాదముందని అంటున్నారు.

Also Read: Hyderabad: తీవ్ర విషాదం.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య